Begin typing your search above and press return to search.

చలించిపోయిన జగన్.. ఆ చిన్నారులకు అండ.. కఠిన చర్యలకు ఆదేశాలు

By:  Tupaki Desk   |   8 Sep 2022 8:06 AM GMT
చలించిపోయిన జగన్.. ఆ చిన్నారులకు అండ.. కఠిన చర్యలకు ఆదేశాలు
X
లోన్ యాప్ లో అప్పు తీసుకున్న పాపానికి.. వారి బెదిరింపులకు బెదిరిపోయి.. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఏపీ దంపతుల వైనం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి తెలిసినంతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు.

నాలుగేళ్లు.. రెండేళ్ల చిన్నారులైన పిల్లల గురించి ఆవేదన చెందారు. లోకం తెలియని పసి వయసులో.. తల్లిదండ్రుల్నికోల్పోయిన వారి వైనం స్థానికంగా పలువురిని కన్నీరు పెట్టిస్తోంది. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న లోన్ యాప్ వేధింపుల బలవన్మరంపై జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

తల్లిదండ్రుల మరణంతో అనాథలైన చిన్నారులకు చెరో రూ.5లక్షల చొప్పున సాయం అందించాలని జగన్ కోరారు. అంతేకాదు చిన్నారుల సంరక్షణ కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మండికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్.. రమ్యలక్ష్మిలు ఆర్థిక ఇబ్బందులతో లోన్ యాప్ లో అప్పు తీసుకోకపోవటం.. వాటిని చెల్లించే విషయంలో జరిగిన ఆలస్యం వారిని తీవ్ర అవమానాలకు గురి చేసింది.

వారి నగ్న చిత్రాలు తమ వద్ద ఉన్నాయని బెదిరింపులకు దిగటంతో పాటు.. బంధువులు.. స్నేహితులకు ఫోన్లు చేసి వారి వివరాలు చెప్పటంతో తీవ్ర అవమానానికి గురైనవారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కారణంగా పని పిల్లలైన ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు.

లోన్ యాప్ ఆగడాలకు కఠిన చర్యలు చేపట్టాలని ఏపీ సర్కారు డిసైడ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆదేశాల్ని జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ చేశారు. ఏమైనా.. వేదన కలిగించే ఉదంతం చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే ఏపీ ముఖ్యమంత్రి స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.