Begin typing your search above and press return to search.
జగన్ ఆ నిర్ణయం పవన్ కోసమేనా?
By: Tupaki Desk | 29 Aug 2022 4:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
ప్రతిపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రయత్నిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలను దెబ్బతీయడానికే ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చిందని నమ్మేవారే ఎక్కువ. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీని దెబ్బతీయడానికే అమూల్‌ను తెచ్చిందని విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యానర్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా కాక రేపుతోంది. సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ఉంది. రాజకీయాల్లో పవన్ జీరోనే కావచ్చు కానీ అభిమానులపరంగా పవన్ ను మించినవారు లేరనేది అందరూ ఒప్పుకునేమాటే. పదేళ్లు పాటు ఒక్క హిట్ లేకపోయినా ఆ ఇమేజ్‌ను చెక్కు చెదరకుండా గబ్బర్ సింగ్ వరకు కాపాడుకుంటూ వచ్చిన ఏకైక హీరో పవన్ అంటే అతిశయోక్తి కాదు.
ఈ నేపథ్యంలో పవన్ జన్మదినంగా సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం ఖాయం. వీటిని లేకుండా చేయడానికే జగన్ ప్లాస్టిక్ నిషేధాన్ని తక్షణం రాష్ట్రంలో అమల్లోకి తెచ్చారని అంటున్నారు. స్వయంగా టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న ఉందని.. భారీ ఎత్తున అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తారు కాబట్టి అవి లేకుండా ఉండటం కోసం తక్షణం ప్లాస్టిక్ నిషేధం అని జగన్ ప్రకటించారని అనిత విమర్శించారు.
ఇది కూడా అచ్చం సినిమా టికెట్ల మాదిరిగానే ఉంటుందా అని అనిత.. జగన్‌ను నిలదీశారు. పవన్ కల్యాణ్ సినిమాలను దెబ్బతీయడానికి ఆన్‌లైన్ సినిమా టికెట్లు అంటూ తెచ్చారని.. పవన్ భీమ్లా నాయక్ విడుదల తర్వాత ఆన్‌లైన్ సినిమా టికెట్లను పట్టించుకోకుండా దాన్ని అటకకెక్కించారని అనిత గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ నిషేధం కూడా ఇలాంటి నిర్ణయమేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కల్యాణ్ పుట్టినరోజు పూర్తవగానే ప్లాస్టిక్‌పై నిషేధం ఎత్తేస్తారా అని ప్రశ్నించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్లెక్సీలు, బ్యానర్ల తయారీదారులు కూడా తీవ్రంగా జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఫ్లెక్సీ ప్రింటర్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని.. ఇప్పటికిప్పుడు ప్లాస్టిక్ నిషేధం అంటే తాము ఏమైపోవాలని నిలదీస్తున్నారు. కొన్ని లక్షల మంది బ్యానర్లు, ఫ్లెక్సీల దుకాణాలు పెట్టుకుని బతుకుతున్నామని ప్రభుత్వ నిర్ణయం తమకు అశనిపాతమేనంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించే ఉద్దేశంతో ఉన్నారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.