Begin typing your search above and press return to search.
జనాదరణ.. నెటిజనాదరణ.. రెండూ జగన్ కే..
By: Tupaki Desk | 28 March 2017 10:27 AM GMTపాలక టీడీపీ నేతలు, సీఎం చంద్రబాబు ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా వైసీపీ అధినేత జగన్ కు మాత్రం జనాదరణ కొంచెంకూడా తగ్గడం లేదు. జనుల్లో ఆదరణతో పాటు నెటిజనుల్లోనూ జగన్ కే ఎక్కువ ఆదరణ ఉందని తాజాగా తేలింది. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం టాప్ సెర్చ్ డ్ లీడర్ గా జగన్ నిలవడం విశేషం.
ఏపీలో నెటిజన్లు పెద్దపెద్ద నాయకులందరినీ పక్కనపెట్టి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని గూగుల్ ట్రెండ్సులో తేలింది. మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జగన్ గ్రాఫ్ హై రేంజిలో ఉండడంతో టీడీపీ నేతలు షాక్ తింటున్నారు.
గడిచిన 90 రోజులలో గూగుల్ ట్రెండ్స్ సమాచారాన్ని సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సమానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపులారిటీ పెరిగినట్లు గూగుల్ తెలిపింది.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాత్రం అసలు పెద్దగా నెటిజన్లు పట్టించుకోవడం లేదు. వాళ్లిద్దరికీ చాలా తక్కువ సంఖ్యలోనే సెర్చ్‌లు వచ్చాయట. మోదీ గురించి సెర్చ్ చేసినవారిలో సగం మంది, కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేసినవారిలో మూడింట రెండొంతుల మంది ఏపీ నుంచి జగన్ కోసం సెర్చ్ చేశారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే రాష్ట్ర నాయకుల కంటే జాతీయ స్థాయి నాయకుల గురించే ఎక్కువగా సెర్చ్ చేయడం గమనార్హం. అలాగే హైదరాబాద్ లో కూడా ఎక్కువమంది నరేంద్రమోదీ - అరవింద్ కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేశారు. మరోవైపు వైఎస్ ఆర్ సీపీ ఫేస్ బుక్ పేజీకి 10 నెలల్లోనే 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ విషయాన్ని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
మరో విశేషం ఏంటంటే జగన్ కోసం ఏపీ - తెలంగాణలోనే కాకుండా కర్ణాటక - మహారాష్ట్ర - తమిళనాడు - ఢిల్లీ నుంచి సెర్చ్ చేసినవారున్నారు. అయితే.. గూగుల్ ట్రెండ్సు కంటే ముందే జనం ట్రెండును చంద్రబాబు గుర్తు పట్టేసినట్లుగా ఉంది.. అందుకే జగన్ పేరు వినిపిస్తే చాలు ఆయన ఉలిక్కిపడుతుంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/