Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రాలో పట్టు కోసం... ?
By: Tupaki Desk | 13 Nov 2021 3:30 PM GMTపోయిన చోట వెతుక్కోవడం తెలివైన పని. ఓడిన వారు ఎటూ ఆ పని చేస్తారు. ఇక గెలిచిన వారు తాము సాధించిన పట్టు నిలుపుకోవడం కోసం మరింత గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. అలా ఉత్తరాంధ్రా జిల్లాల మీద జగన్ బాగానే ఫోకస్ పెడుతున్నారు. నిజానికి ఉత్తరాంధ్రా జిల్లాలు టీడీపీకి కంచు కోటలు. వైఎస్సార్ లాంటి లీడర్ ఏలుబడిలో కూడా ఈ జిల్లాల్లో టీడీపీ హవాను ఆపలేకపోయారు. అయితే చిత్రంగా 2019 ఎన్నికల్లో మాత్రం నూటికి ఎనభై శాతం సీట్లు వైసీపీ పరం అయ్యాయి. విజయనగరం జిల్లా విషయానికి వస్తే కంప్లీట్ గా స్వీప్ చేసి పారేశారు. ఇలా మూడు జిల్లాల్లో సైకిల్ కి పంక్చర్ చేసి మరీ ఫ్యాన్ పార్టీ గిర్రున తిరిగేసింది.
అటువంటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ కావాలీ అంటే కష్టమైన పనే. కానీ జగన్ మాత్రం ఉత్తరాంధ్రా తోడుంటేనే ఏపీలో మళ్లీ వైసీపీకి అధికారం అని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో జరిగిన తప్పులు ఫ్యూచర్ లో జరగకుండా ఈ మూడు జిల్లాలకు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పదవుల పంపిణీ కూడా అందులో భాగనే అంటున్నారు. మొత్తం ఏపీలో 14 ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడితే ఇందులో నాలుగు పదవులు ఈ మూడు జిల్లాలకు దక్కాయీ అంటే ఉత్తరాంధ్రా మీద వైసీపీ చూపుతున్న శ్రధ్ధకు ఇదే నిదర్శనం అంటున్నారు. ఇప్పటికే ఈ జిల్లాల నుంచి ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా తరఫున దువ్వాడ శ్రీనుకు పదవి ఇచ్చారు. ఇపుడు కూడా అదే జిల్లా నుంచి పాలవలస విక్రాంత్ కి పదవి దక్కింది.
ఈయన తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఇక విజయనగరం జిల్లాలో బీసీలు ఉన్నా కూడా రాజుల ప్రాబల్యం కూడా రాజకీయంగా గట్టిగానే ఉంటుంది. దాంతో పాటు వైసీపీకి ఆ వర్గం నుంచి ఇపుడు గట్టి సవాల్ ఎదురవౌతోంది. దాంతో కొత్తవలసకు చెందిన ఇందుకూరి రఘురాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈయన పారిశ్రామికవేత్తగా ఉన్నారు. క్షత్రియ సామాజికవర్గంలో బలం ఉంది. జగన్ విజయనగరం జిల్లా పాదయాత్ర సందర్భంగా ఆయన పార్టీలో చేరారు. ఆయన 2019 ఎన్నికల్లో ఎస్ కోట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే నాడు జగన్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పార్టీ నిర్ణయించిన అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. అక్కడ వైసీపీకి మంచి మెజారిటీ దక్కింది. దాంతో రఘురాజుకు ఇచ్చిన హామీ మేరకు జగన్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని అంటున్నారు.
విశాఖ విషయానికి వస్తే సిటీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ దక్కింది. ఆయన పదేళ్ళుగా వైసీపీలో ఉంటూ పోరాటం చేస్తున్నారు. జగన్ విశాఖ తొలిసారి వస్తే ఆయన ఇంట్లోనే బస చేశారు. నాటి నుంచి జగన్ తో సన్నిహిత బంధం ఏర్పడింది. ఆయనకు అధికార హోదా ఇవ్వాలని జగన్ కి ఉన్నా కూడా వివిధ రకాలైన సమీకరణలతో ఇప్పటిదాక కుదరలేదు. ఇపుడు ఆ అవకాశం వచ్చింది. విశాఖ సిటీ లో పెద్ద ఎత్తున యాదవులు ఉన్నారు. వంశీని ఎమ్మెల్సీ చేయడం ద్వారా ఆయా వర్గాలను పార్టీ వైపుగా తిప్పుకునే ఆలోచన ఉందని అంటున్నారు.
ఇక విశాఖ రూరల్ జిల్లా నుంచి మహిళా నేత వరుడు కళ్యాణికి ఎమ్మెల్సీ దక్కింది. ఆమె పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. జిల్లాలో వారు పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో రానున్న రోజుల్లో అది కలసి వచ్చే అంశమని పార్టీ అంచనా కడుతోంది. దాంతో పాటు ఆమె గతంలో పార్టీ విజయానికి కృషి చేశారన్న కారణంతోనే ఈ గౌరవం ఇచ్చారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే మూడు జిల్లాలలో సామాజిక రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకునే ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికను జగన్ చేపట్టారని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో టీడీపీని ఈ ఎత్తులు వ్యూహాలు ఎంతవరకూ తగ్గిస్తాయో చూడాల్సిందే.