Begin typing your search above and press return to search.
జగన్ మరో సంచలన నిర్ణయం..కుప్పంలో బాబుకు దెబ్బే..
By: Tupaki Desk | 14 Oct 2019 1:15 PM GMTరోజుకొక సరికొత్త నిర్ణయం తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 50 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కూడా ఉంది. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మూడు గ్రామ పంచాయతీలకు మునిసిపాల్టీలుగా చోటు కల్పించారు.
అయితే చంద్రబాబుని దెబ్బకొట్టేందుకు జగన్ ఈ కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కుప్పంని మున్సిపాలిటీ చేసి - దానికి భారీగా నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పని చేయనున్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కుప్పంలో సత్తా చాటేందుకు చూస్తున్నారు. కుప్పంలో అభివృద్ధి చేయడం ద్వారా చంద్రబాబు చేయని పనులను తాము చేశామని చెప్పుకోవడానికి వీలు ఉంటుందనేది వైసీపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
చంద్రబాబు 1989 ఎన్నికల నుంచి కుప్పంలో గెలుస్తూనే ఉన్నారు. కానీ తాజా ఎన్నికల్లో మునుపటి కంటే మెజారిటీ భారీగా తగ్గింది. 2014 ఎన్నికల్లో 47 వేల మెజారిటీ వస్తే - 2019 ఎన్నికల్లో 30 వేలే వచ్చింది. ఇక ఇప్పుడు కుప్పంలో వైసీపీ మరింత అభివృద్ధి చేస్తే వచ్చే ఎన్నికల నాటికి పరిస్తితి మారోచ్చు. అలాగే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కుప్పంని దక్కించుకోవచ్చు.
జిల్లాల వారీగా కొత్త మున్సిపాలిటీలు వివరాలు...
కృష్ణా జిల్లా: అవనిగడ్డ - కైకలూరు - మైలవరం - పామర్రు - విస్సన్నపేట
గుంటూరు జిల్లా: గురజాల - నిజాంపట్నం - దాచేపల్లి-నడికుడి ఉమ్మడి మున్సిపాలిటీ.
ప్రకాశం జిల్లా: దర్శి - పొదిలి - మార్టూరు - టంగుటూరు - సింగరాయకొండ - వేటపాలెం
చిత్తూరు జిల్లా: కుప్పం
కర్నూలు జిల్లా: బేతంచర్ల - కోయిలకుంట్ల - పత్తికొండ - కోడుమూరు - బనగానపల్లె - పాణ్యం
విశాఖపట్నం జిల్లా: ఆనందపురం - నక్కపల్లి - పాయకరావు పేట
విజయనగరం జిల్లా: కురుపాం - చీపురుపల్లి-గరివిడి (ఉమ్మడిగా)
శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేట - టెక్కలి - పాతపట్నం - రణస్థలం
కడప జిల్లా: రైల్వే కోడూరు - నందలూరు - వేంపల్లి
తూర్పు గోదావరి జిల్లా: కొత్తపేట - రావులపాలెం - అనపర్తి - జగ్గంపేట
పశ్చిమ గోదావరి జిల్లా: ఆకివీడు - చింతలపూడి - అత్తిలి
అనంతపురం జిల్లా: పెనుకొండ - ఉరవకొండ - గోరంట్ల
నెల్లూరు జిల్లా: బుచ్చిరెడ్డి పాలెం-కొవ్వూరు (ఉమ్మడిగా) - కోట-వాకాడు-గూడలి - ఆలూరు - పొదలకూరు - ముత్తుకూరు - రాపూరు - తడ-తడ కండ్రిగ (ఉమ్మడిగా).