Begin typing your search above and press return to search.
జగన్ టార్గెట్ అక్టోబర్.. ఆ 6 ఫిక్స్!
By: Tupaki Desk | 25 Jun 2020 11:30 PM GMTతండ్రి వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ సైతం ఏపీ సాగునీటి ప్రాజెక్టులకే పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పోలవరంను పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్.. తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై గురువారం మంత్రి అనిల్, అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ లోగా ఆరు ప్రాజెక్టులు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు.
వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ఫేస్2, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, అవుకు టన్నెల్ 2 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. అవుకు2 ను అక్టోబర్ లో పూర్తి చేయాలని సంకల్పించారు.
పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రూ.3791 కోట్లకు సంబంధించిన కేంద్రం రీఎయింబర్స్ మెంట్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 41.5 మీటర్ల ఎత్తు వరకు ప్రస్తుతం ముంపు ప్రమాదం ఉందని వారికి పునరావాసం కల్పించాలని సూచించారు.