Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా హత్యపై జగన్ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 7 Feb 2020 6:24 AM GMTఅది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం.. సీఎంగా చంద్రబాబు పాలన చివరి రోజులు.. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రతో వచ్చిన ఊపుతో ప్రచారంలో దూసుకు పోతున్న సమయం. అలాంటి సమయంలో పులివెందుల లో వైఎస్ జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగడం కలకలం రేపింది. చంద్రబాబే చంపించారని సీబీఐ విచారణ జరిపించాలని నాటి ప్రతిపక్ష నేత హోదా లో వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అంతేకాదు హైకోర్టులో వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పిటీషన్ కూడా దాఖలు చేశారు.
అయితే ఆ ఎన్నికలతో ముఖచిత్రం మారింది. సీఎంగా జగన్ అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పాత్రలు మారిపోయాయి. వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ను నియమించి విచారణ జరిపిస్తున్నారు. విచారణ తుది దశకు వచ్చింది.
ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ హత్య కేసును సీబీఐ కి అప్పగించాలని గతంలో తాను హైకోర్టు లో దాఖలు చేసిన పిటీషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు సీఎం జగన్ తాజాగా హైకోర్టు కు తెలిపారు.
ఈ కేసులో తదుపరి ఆదేశాలు అక్కర్లేదని జగన్ కోర్టును అభ్యర్థించ గా.. న్యాయమూర్తి మెమో దాఖలు చేయాలని ఆదేశించారు.
సీబీఐ దర్యాప్తు అవసరం లేదని.. సిట్ విచారణ పట్ల సంతృప్తిగా ఉన్నందునే సీఎం జగన్ పిటీషన్ వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.