Begin typing your search above and press return to search.
ఏపీ రాజధానిపై జగన్ కీలక ప్రకటన
By: Tupaki Desk | 22 Nov 2021 9:56 AM GMTఏపీ మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాజధానిపై ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు జగన్ ప్రకటించారు.
3 రాజధానులపైనే తమ స్టాండ్ అని.. ఇంతకుముందు చేసిన బిల్లు లోపభూయిస్టంగా ఉండడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడిందని.. అందుకే దాన్ని ఉపసంహరించుకొని మెరుగైన బిల్లును తీసుకొస్తామని జగన్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను తెలుసుకొని కొత్త బిల్లును తీసుకొస్తామని జగన్ ట్విస్ట్ ఇచ్చారు.
చట్ట, న్యాయపరంగా అన్నింటినికి సమాధానం ఇచ్చేందుకు సమగ్ర, మెరుగైన బిల్లుతో సభ ముందుకు రాబోతున్నట్టు జగన్ ప్రకటించారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు జగన్ ప్రకటించారు. సరికొత్త బిల్లుతో సభ ముందుకు వస్తామని జగన్ ప్రకటించారు. ఇంతకుముందు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.
తెలంగాణకు హైదరాబాద్, కర్నాటక కు బెంగళూరు, తమిళనాడుకు చెన్నైలాగా మనకూ ఒక సిటీ కావాలని.. మన పిల్లలు ఇతర నగరాలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని జగన్ అన్నారు. అన్ని అవకాశాలున్న విశాఖను అభివృద్ధి చేస్తామంటూ జగన్ ట్విస్ట్ ఇచ్చారు.
3 రాజధానులపై మరింత కసరత్తు చేసి బిల్లులో సమగ్రంగా మార్పులు చేసి మళ్లీ కొత్త బిల్లు పెడుతామని జగన్ ప్రకటించారు. న్యాయపరంగా ఎక్కడా తలొగ్గకుండా ఈ బిల్లును తీసుకొస్తామని ప్రకటించారు. మూడు రాజధానుల విషయంలో ఏం జరిగింది? ఎలా బిల్లు కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి? ఎలా ముందుకెళుతామన్నది వివరిస్తామని జగన్ తెలిపారు. బిల్లులో సమగ్ర మార్పులు చేసి తీసుకొస్తామని ప్రకటించారు.
దీన్ని బట్టి 3 రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదని తేలిపోయింది. అదే కాన్సెప్ట్ తో సమగ్రంగా బిల్లును పెడుతామని జగన్ ప్రకటించారు. అంటే ఏపీకి మూడు రాజధానులు పక్కా అని తెలుస్తోంది. లేదంటే విశాఖను రాజధానిని చేయవచ్చని తెలుస్తోంది. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.