Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స్టెప్ అదిరిపోయిందంటున్నారు

By:  Tupaki Desk   |   22 Feb 2017 3:21 PM GMT
జ‌గ‌న్ స్టెప్ అదిరిపోయిందంటున్నారు
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహ‌న్ రెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌ణాళిక‌ల‌కు మ‌రింత ప‌దున పెడుతున్నారు. ఈ క్ర‌మంలో భావోద్వేగాల కంటే త‌న ప్ర‌త్య‌ర్థి అయిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌డంపై దృష్టిసారించారు. ఈ క్ర‌మంలో ఒకింత ముందుగానే బాబు ఆలోచ‌న‌ల‌ను ప‌సిగ‌ట్టి త‌న మార్కు చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించాడ‌ని అంటున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌క‌టించిన నిరుద్యోగ భృతిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు రానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న క్ర‌మంలో జ‌గ‌న్ ముందుగానే స్కెచ్ వేశారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.

2014 ఎన్నికల సమయంలో ఇంటికి ఒక ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున‌ హామీ ఇచ్చార‌ని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 2 వేల రూపాయిల నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారని, జాబు కావాలంటే బాబు రావాలని ఊరూరా ఊదరగొట్టారని ప్ర‌స్తావించారు. అయితే అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటుతున్నా ఇప్ప‌టికీ వాటిని నెర‌వేర్చ‌లేద‌ని త‌న లేఖలో పేర్కొన్నారు. ఈ 33 నెలల్లో రూ. 2 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ. 66 వేలు చెల్లించాల్సివుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1 కోటీ 75 లక్షల కుటుంబాలకు ఒక లక్షా 15 వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారని జ‌గ‌న్ త‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు. నిరుద్యోగులకు బకాయిలతో పాటు భృతి మొత్తాన్ని చెల్లించేందుకు 2017-18 బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మీరిచ్చిన మాటను మేం పదేపదే గుర్తు చేస్తూనే ఉన్నామని పేర్కొంటూ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/