Begin typing your search above and press return to search.
రైతుల కష్టాలపై బాబుకు వైఎస్ జగన్ లేఖ
By: Tupaki Desk | 14 Oct 2017 5:26 PM GMTభారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే...ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గం పట్టింపు లేనట్లుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ఆవేదన, ప్రజల ఆక్రందన పట్టించుకునే తీరిక సీఎం చంద్రబాబుకు లేపోవడంపై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. వర్షాలు ప్రారంభం కాగానే అవి మీవల్లే కురుస్తున్నాయన్న ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి జలహారతి అంటూ ప్రచార డ్రామాలు ఆడారని పేర్కొంటూ... వర్షాలు ఎక్కువై రాష్ట్రంలోని రైతాంగమే మునిగిపోతుంటే మాత్రం కుంభకర్ణుడికి పెద్దన్న మాదిరిగా సీఎం, మంత్రిమండలి నిద్రపోతున్నారని ఆక్షేపించారు. ఇదేమి ప్రభుత్వం చంద్రబాబు గారూ అంటూ జగన్ నిలదీశారు.
``రైతు గుండెకోత,తల్లిదండ్రుల కడుపుకోత మిమ్మల్ని కదలించడం లేదా..? కాస్త మారండి..ప్రజల గురించి పట్టించుకోండి..నీరో పాలన కన్నా...నారా పాలన ఘోరంగా ఉందని ఎందుకంటున్నారో ఆలోచించండి..విద్యార్ధులు,నిరుద్యోగులు ఆత్మహత్యల్లో మీ పాత్ర ఉందని ఆత్మపరిశీలన చేసుకోండి`` అని జగన్ తన లేఖలో సూచించారు. సున్నా వడ్డీ,పావలా వడ్డీ పథకాలను భూమిలో పాతేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. `` మీరు అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న మొత్తం రూ.87 వేల కోట్లను రుణాలను మాఫీ చేయకపోవడంతో ఆ తర్వాత ఏటా రూ.14,000 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.56,000 కోట్లు వడ్డీగా, అపరాధ వడ్డీగా చెల్లించుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది`` అని జగన్ ఆరోపించారు. ``గిట్టుబాటు ధరలు పెరగకుండా చూడటంలో మీదొక రికార్డ్. రైతులకు రుణాలు ఇవ్వొద్దని ఎస్ఎల్బీసీ మీటింగ్ లో మీరే చెప్పారు.
రోమ్ తగలబడుతుంటే...నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరు ఉందని తన లేఖలో జగన్ మండిపడ్డారు. `` ఆ సామెతను అందరూ మరిచిపోయేలా చేసి మీరు సన్మానాలు, సత్కారాలు, ల్యాండ్ డీల్స్, విదేశీ ప్రతినిధులతో ఫోటోలు వంటి కార్యక్రమాల్లో గత నాలుగు రోజులుగా తలమునకలయ్యారని సీఎం డైలీ షెడ్యూల్ చూసిన ఎవరికైనా వెంటనే అర్థం అవుతుంది`` అని జగన్ లేఖలో మండిపడ్డారు. ``గిట్టుబాటు ధరలు పెరగకుండా చూడటంలో మీదొక రికార్డ్. రైతుల కష్టాలపై ఇకనైనా స్పందించండి. ఒక రైతు గుండెకోత కాని, తల్లిదండ్రుల కడుపుకోత కాని మిమ్మల్ని కదిలించడంలేదంటే.. ఎంత ఘోరం చంద్రబాబు గారూ ఇది! అయ్యా... మీరు మారండి..ప్రజల గురించి పట్టించుకోండి.`` అంటూ తన లేఖలో సీఎం చంద్రబాబును కోరారు.