Begin typing your search above and press return to search.
జగన్ లండన్ టూర్!...ఇప్పుడే ఎందుకు?
By: Tupaki Desk | 15 Feb 2019 9:10 AM GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన సుదీర్ఘ పాదయాత్ర ముగిసిన తర్వాత లండన్ లో చదువుకుంటున్న తన కూతురును చూసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆ టూర్ ను ఆయన రద్దు చేసుకున్నారు. టూర్ రద్దయిన విషయాన్ని మాత్రమే ప్రకటించిన వైసీపీ... అందుకు గల కారణాలను ఏమాత్రం వెల్లడించలేదు. అంతేకాకుండా జగన్ ఫ్లైట్ ఎక్కుతారనగా... ఈ టూర్ రద్దు కావడం కూడా నాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎన్నికల ముంగిట విదేశీ టూర్ కు వెళితే... విలువైన సమయాన్ని కోల్పోయినట్టేనన్న వాదన కూడా నాడు వినిపించింది. కారణం ఏదైనా జగన్ టూర్ ఎన్నికలు ముగిసే దాకా ఉండదని అంతా భావించారు. అయితే అందరికీ షాకిస్తూ... జగన్ ఫారిన్ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో నేడు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. లండన్ లో విద్యనభ్యసిస్తున్న తన కూతురును చూసి వచ్చేందుకు తాను లండన్ వెళుతున్నానని, ఈ పర్యటనకు అనుమతించాలని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. సరిగ్గా ఎన్నికలకు ముందు, అది కూడా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు జగన్ విదేశీ పర్యటనకు వెళుతుండటం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు - ఓ ఎంపీ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. త్వరలోనే మరింత మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఈ లెక్కన ఈ రెండు నెలలు వైసీపీకి చాలా క్రూసియల్ అని చెప్పక తప్పదు. ఇలాంటి తరుణంలో ఓ వారం పాటు జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమైపోవడం నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయమే.
పాదయాత్ర - ఆ తర్వాత శంఖారావం - ఎన్నికల వ్యూహ రచన... ఇలా నాన్ స్టాప్ కార్యక్రమాలతో జగన్ ఇటీవలి కాలంలో రెస్ట్ లెస్‌గానే ఉంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న జగన్... కాస్తంత రెస్ట్ తీసుకోవడంతో పాటుగా విదేశాల్లోని కూతురును చూసి వస్తే... కాస్త బాగుంటుందన్న భావనతోనే ఆయన ఫారిన్ టూర్ కు వెళుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ టూర్ వెనుక కూతుర్ని పలకరించి రావడంతో పాటుగా చాలా పెద్ద పనినే జగన్ పెట్టుకున్నారన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ఈ వాదనల ప్రకారం ఎన్నారైల నుంచి నిధులు సమీకరించుకునేందుకే జగన్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసినట్టు కొందరు అనుకుంటూ ఉంటే... ఎన్నికల వేళ అవసరమయ్యే నిధులను సర్దుకోవడానికి జగన్ ఈ టూర్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారని మరికొందరు వాదిస్తున్నారు. కారణం ఏదైనా ఎన్నికల ముంగిట జగన్ ఫారిన్ టూర్ ను ప్లాన్ చేసుకుని కొత్త కొత్త విశ్లేషణలకు ఆస్కారమిచ్చారని చెప్పాలి.