Begin typing your search above and press return to search.

ఏపీలో ఇవి తప్పనిసరి చేసిన జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   25 April 2020 11:10 AM GMT
ఏపీలో ఇవి తప్పనిసరి చేసిన జగన్ సర్కార్
X
కరోనా తెచ్చిన లాక్ డౌన్ తో రైతులకు కొత్త కష్టాలు వచ్చాయి. పంట కోతకు కూలీల కొరత, మిషనరీల కొరత వెంటాడుతోంది.ఇక చేతికొచ్చిన ధాన్యాన్ని కొనేవారు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ తాజాగా రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు శనివారం నుంచి అమలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్లో దళారీలతో మోసపోకుండా.. కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం సాధారణ రకానికి క్వింటాలుకు వరి 1815 రూపాయలు, ఏ గ్రేడ్ రకానికి రూ.1835 రూపాయలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు జీపీఎస్ ఉన్న వాహనాలనే ఉపయోగించాలని అధికారులను ఆదేశించింది. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులపై 1902 టోల్ ఫ్రీ నంబర్ కు రైతులు ఫిర్యాదు చేయాలని సూచించింది.

రైతుల పంట, ధాన్యం, పూర్తి వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు డేటా తయారు చేసి సచివాలయంలో ప్రదర్శించాలని ఆదేశించింది.ప్రతీ రైతు వద్ద ఆధార్, మొబైల్ నంబర్, పట్టాదార్ పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని వ్యవసాయ సహయకులను ప్రభుత్వం ఆదేశించింది. ఇవి లేకుంటే కొనుగోళ్లు జరపరు. వీటిని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. జన్ ధన్ ఖాతాల్లో 50వేలకు మించి డబ్బులు పడవు. దీంతో ధాన్యం అమ్మిన రైతులకు ఎలా డబ్బులు చెల్లించాలనేదానిపై అధికారులు మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం పేర్కొంది.