Begin typing your search above and press return to search.

హీట్ పెరిగింది : జగన్ మార్క్ పాలిటిక్స్ ఏమిటి...?

By:  Tupaki Desk   |   31 May 2022 1:30 PM GMT
హీట్ పెరిగింది : జగన్ మార్క్ పాలిటిక్స్ ఏమిటి...?
X
ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ స్కోర్ నోరూ బాగా పెరిగింది. ఏపీలో చూస్తే రాజకీయం కూడా దూకుడు మీద ఉంది. రీసెంట్ గా మహానాడు సుపర్ సక్సెస్ తో టీడీపీ మంచి జోష్ మీద ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే మే నెల ఎండలతో పాటు ఏపీలో పెరిగిన పొలిటికల్ డెవలెప్మెంట్స్ అన్నీ కూడా జగన్ లేని టైమ్ లో జరివినవే.

జగన్ మే 20న ఏపీ నుంచి బయలుదేరివెళ్ళారు. ఆయన కచ్చితంగా పన్నెండు రోజుల పాటు ఏపీలో లేరు. ఇంత సుదీర్ఘమైన టూర్ జగన్ సీఎం గా చేసి ఎరగరు. సీఎం గా ఆయన ఇన్నాళ్ళు ఏపీని విడిచి వెళ్ళింది లేదు. ఈ మధ్యలోనే కోనసీమలో మంటలు చెలరేగాయి. ఏకంగా వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళు తగలబెట్టేశారు.

ఒక వైపు సామాజిక న్యాయ భేరీ పేరిట మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర ఏపీలో సాగినా మైలేజ్ మాత్రం మహానాడుకే వచ్చింది. దాంతో ధీమాగా ఉన్న టీడీపీ ఒక వైపు ఉంటే డీలా పడిన వైసీపీ ఇంకో వైపు ఉంది. ఈ క్రమంలో జగన్ దావోస్ ట్రిప్ ముగించుకుని తాడేపల్లిలోని తమ నివాశంలో ల్యాండ్ అయ్యారు.

మరి జగన్ వచ్చారు కనుక వైసీపీ జోరు పెంచుతుందా. మహానాడు సహా ఈ మధ్య బాదుడే బాదుడు వంటి చోట్ల టీడీపీ అధినాయకుడు చంద్రబాబు సహా ఇతర నాయకులు చేసిన హాట్ కామెంట్స్ కి జగన్ నుంచి జవాబు అదిరిపోయే స్థాయిలో ఉంటుందా. ఇక ఏపీలో వైసీపీ సీన్ అయిపోయింది వచ్చేది టీడీపీయే అన్న వాతావరణం తీసుకురావడానికి ఆ పార్టీ చూస్తోంది.

మరి ఈ కీలకసమయంలో వైసీపీ నుంచి బిగ్ మూవ్ ఉంటుందా. జగన్ స్ట్రాటజీ ఏంటి, జగన్ ఆలోచనలు ఏంటి, టీడీపీ జోరు అంతకంతకు పెరిగిపోతున్న వేళ జగన్ ఏం చేయబోతున్నారు ఇవన్నీ కూడా ప్రశ్నలే. విదేశాల నుంచి వచ్చిన జగన్ ఏపీకి దండీగా పెట్టుబడులు తెచ్చారో లేదో కానీ ఏపీలో మాత్రం అంతకు మించి సమస్యలు ఉన్నాయి.

రాజకీయంగా జగన్ సెట్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి. మరి జగన్ ఎప్పటిమాదిరిగానే సైలెంట్ గా ఉంటూ టీడీపీ కి చెక్ పెట్టే వ్యూహాలను అనుసరిస్తారా లేక ఏదైనా జిల్లా టూర్ కి వెళ్ళి అక్కడ చంద్రబాబు సహా విపక్షాలకు గట్టి డోస్ ఇస్తారా. చూడాల్సిందే.