Begin typing your search above and press return to search.
కృష్ణా నదీ జలాలపై కేసీఆర్ వాదనకు ధీటైన కౌంటర్ ఇచ్చిన జగన్ మీడియా
By: Tupaki Desk | 5 July 2021 9:40 AM GMTవాదనలు ఎప్పుడు ఏకపక్షంగా ఉండకూడదు. దీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టినట్లుగా చెప్పుకునే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టులు.. నీళ్ల పంచాయితీలు తెర మీదకు వచ్చినప్పుడు.. మౌనంగా ఉండిపోతారు. ఏపీలో కీలక పదవుల్ని చేపట్టటమే కాదు.. భవిష్యత్తులో కూడా అధికారంలోకి రావాలని తపించే చంద్రబాబు.. ఏపీ ప్రజల ప్రయోజనాలకు కీలకమైన కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ చెప్పే వాదనకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఎలాంటి వాదనను వినిపించకుండా మౌనంగా ఉండటం కనిపిస్తుంది.
తాజాగా కృష్ణా నదీ జలాలపై ఏపీ అధికారపక్షానికి చెందిన మీడియా సంస్థలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వినిపించే వాదన.. సంధించే ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇవ్వటమే కాదు.. ఆయన మాటల్లో నిజాలు ఏ మాత్రం లేవన్న విషయాన్ని ఆధారాలతో సహా చెప్పిన వెల్లడించిన వైనం ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ వాదనను ఏపీకి చెందిన నీటి పారుదల రంగ నిపుణులతో పాటు.. న్యాయ నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైనాన్ని అక్షర బద్ధం చేశారు.
ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 టీఎంసీలు.. తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూన్ 19న కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటును ఆమోదించిన ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు సంతకం చేయటాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లుగా ప్రకటించటాన్ని తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని.. ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయటమేనని స్పష్టం చేస్తున్నారు. భజన చట్టం 11వ షెడ్యూల్‌లో ఏపీలోని తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులను కేంద్రం అధికారికంగా గుర్తించింది. అలాగే, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలనూ గుర్తించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్లాన్–బి కింద అదనంగా కేటాయించిన జలాల్లోనూ కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు 150.5 టీఎంసీలు ఏపీకి, 44 టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశముందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే.. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందని.. తెలంగాణ వాటా 342.96 టీఎంసీలకు చేరుతుందే తప్ప.. చెరిసగం కానేకాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయాలన్ని తెలిసి కూడా తెలంగాణ సర్కారు విరుద్ధంగా చేస్తున్న వాదన ఏ మాత్రం సరికాదని స్పష్టం చేస్తున్నారు.
కృష్ణా జలాలను.. ఆ నది పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర.. కర్ణాటక.. ఉమ్మడి ఏపీలకు పంపిణీ చేయటానికి 1969లో జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేంద్రం కేడబ్ల్యూడీటీ 1ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976లో తుది తీర్పు ఇచ్చింది. అందులో పలు అంశాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. అందులో కీలకమైన అంశం మొదట నీటిని వాడుకున్న ప్రాజెక్టుకు ప్రథమ హక్కును మూలసూత్రంగా పరిగణించారు. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా ఇచ్చింది. నిర్మాణం, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది.
విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్రానికి నీటిని కేటాయింపులకు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కే అప్పజెప్పారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయటంపై ఐదేళ్లుగా బ్రిజేషన్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల జోలికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెళ్లే అవకాశం లేదని.. అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను విభజన చట్టంలో 11వ షెడ్యూలులో కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు పంపిణీ చేయడంపైనే కసరత్తు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ చేసిన ఒడంబడికపై ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే దాకా ఇదే ఒప్పందం ప్రకారం నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. వాస్తవాలిలా ఉంటే.. కృష్ణా జలాల్లో చెరి సగం వాటా దక్కాలని తెలంగాణ సర్కార్ తీర్మానం చేయడం, 2015లో ఆమోదించిన ఒప్పందం నుంచి బయటకొస్తామని ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని, ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమే అన్నది నిపుణుల మాట. ఈ వాదనల్ని తన మాటల శక్తితో ప్రచారంలోకి రాకుండా చేస్తున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.