Begin typing your search above and press return to search.

జగన్ తో అంబానీ భేటీలో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   29 Feb 2020 2:04 PM GMT
జగన్ తో అంబానీ భేటీలో ఏం జరిగింది?
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ తో అంబానీ భేటీ అయ్యారు. ముఖేశ్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ ఉన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఏపీ సీఎం జగన్ తో అంబానీ బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు - విశాఖలో పరిశ్రమల ఏర్పాటుపై జగన్ - అంబానీ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో పరిశ్రమల ఏర్పాటు - పారిశ్రామిక వ్యవహారాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. దీంతోపాటు - రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రిలయన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టే విషయంపై జగన్ - అంబానీలు చర్చించుకున్నట్లు సమాచారం. సమావేశం ముగిసిన అనంతరం సీఎం నివాసం నుంచి తిరిగి ముంబైకు అంబానీ బయలుదేరారు. కాగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు పలువురు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పరిశ్రమల ఏర్పాటు - స్థలాల ఏర్పాటు - రాయితీలు వంటి అంశాలపై సీఎంతో పలువురు పారిశ్రామిక వేత్తలు చర్చించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.