Begin typing your search above and press return to search.
హైపవర్ కమిటీ భేటీ...జగన్ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 17 Jan 2020 8:34 AM GMTరాజధాని తరలింపు - అమరావతి రైతుల సమస్యలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఏపీ హైపవర్ కమిటీ ఇవాళ సమావేశం అయింది. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమైన కమిటీ సభ్యులు ఆ సమావేశాల్లో చర్చించిన అంశాలను సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. రాజధాని తరలింపు ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించాలి.. ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశంపైనా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అమరావతి రైతుల సమస్యలు - వారు లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం - రాజధాని తరలింపు అనంతరం ఉద్యోగులకు విశాఖలో సౌకర్యాలు వంటి అంశాలపై చర్చ జరిగింది.
రాజధాని తరలింపు ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించాలి - ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశంపైనా భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సరైన ప్రత్యామ్నాయాలు ఏంటి అనే అంశాలను ముఖ్యమంత్రి జగన్ కు ఈ సమావేశంలో హైపవర్ కమిటీ సభ్యులు వివరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోగా ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక సమర్పించనుంది. మరోవైపు ఇదే హైపవర్ కమిటీకి చివరి సమావేశం కానుందనే అంచనాలున్న నేపథ్యంలో...పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
కాగా, హైపవర్ కమిటీ తొలి సమావేశంలో జీఎన్ రావు కమిటీ - బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇచ్చిన నివేదికలపై చర్చించింది. రెండో సమావేశంలో రాజధాని రైతుల ఆందోళన - రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి - సచివాలయం ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. ఇక, మూడో సమావేశంలో అన్ని జిల్లాల అభివృద్ధిపై చర్చించారు.