Begin typing your search above and press return to search.

బిగ్ పిక్ : గవర్నర్ కి చేరిన మంత్రుల లిస్టు

By:  Tupaki Desk   |   7 Jun 2019 12:20 PM GMT
బిగ్ పిక్ : గవర్నర్ కి చేరిన మంత్రుల లిస్టు
X
జగన్ స్పీడ్ మామూలుగా లేదు. మిలిటరీ డిసిప్లైన్ తో అన్ని పనులు ముందుకు సాగుతున్నాయి. అవి ప్రభుత్వ ఏర్పాటుకావచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు - పింఛన్లు కావచ్చు. అన్ని నిర్ణయాలు టకటకా అయిపోతున్నాయి. ఏపీ మంత్రులెవరా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జగన్ తాను ఎంపిక చేసిన 25 మంది పేర్లను గవర్నర్ ముందుంచారు. గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే అవి విడుదల కానున్నాయి.

వైసీపీకి చెందిన కేబినెట్ ఆస్పిరెంట్లు గుండెలు చేతుల్లో పట్టుకుని ఆ లిస్టు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ పేరు ఉంటుంది. కచ్చితంగా ఉంటుంది... అనుకుంటూ వేయి కళ్లతో కోటి ఆశళతో ఎదురుచూస్తుండగా 25 మంది అదృష్టవంతుల లిస్టు ఆల్రెడీ గవర్నర్ కు చేరిపోయాయి. మరి ఆ లిస్టులో ఉండే అదృష్టవంతులెవరో మరి. మరి కొద్దిసేపట్లో జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది.