Begin typing your search above and press return to search.
చంద్రబాబు నన్ను వేధిస్తున్నారు... రక్షించండి
By: Tupaki Desk | 1 Oct 2015 11:57 AM GMTఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన... వైసీపీకి అధ్యక్షుడు... వయసులో చిన్నోడే అయినా వ్యాపారాలు - వ్యవహారాలు - రాజకీయాల్లో కూడా ఆరితేరిపోయిన వ్యక్తే... అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నరు వద్ద గురువారం తన కష్టాలను మొరపెట్టుకున్నారు. ఏ అండాదండా లేని అబలలా ''నన్ను వేధిస్తున్నారు సార్'' అంటూ గవర్నరు వద్ద బాధపడిపోయారు. తన దీక్షకు అనుమతి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తోందని ఆయన గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.
గవర్నర్ తో భేటీ అయిన జగన్... ప్రత్యేక హోదాపై ఈనెల 7న తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని గవర్నర్ కు వినతి చేశారు. ఈ నెల 7వ తేదీన తాను గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను ఆయన గవర్నర్ దృష్టికి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో జగన్ ఈ నెల 7 నుంచి గుంటూరులోని నల్లపాడు రోడ్డులో జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు సెప్టెంబర్ 27వ తేదీన గుంటూరులో నిరాహార దీక్ష చేయాలనుకున్నా ప్రభుత్వ కనీసం ఏర్పాట్లు కూడా చేయనివ్వలేదు. పోలీసులు దానికి అనుమతి ఇవ్వలేదు. దానిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేస్తూ సాధారణ పద్ధతిలో రావాలని సూచించారు. ఆ నేపథ్యంలో వైయస్ జగన్ తన దీక్షను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసుకున్నారు. దీక్షకు అనుమతి ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పోలీసులు అనుమతి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి 7న తలపెట్టిన దీక్ష కూడా అనుమానమే... దాంతో జగన్ ఏ పుట్టలో ఏమందో అన్న ఉద్దేశంతో గవర్నరును కలిశారు. అయితే... తెలుగు రాష్ట్రాలకు తానే గవర్నరునన్న విషయమే ఆయన మరిచిపోయేలా చేసిన తరుణంలో ఆయన మాట చంద్రబాబు వింటారా అన్నది మాత్రం జగన్ ఆలోచించినట్లు లేదు.