Begin typing your search above and press return to search.
సీబీఐకి కేసు ఇవ్వండి లేకపోతే కోర్టుకెళతా - జగన్
By: Tupaki Desk | 16 March 2019 2:01 PM GMTమా బాబాయిని దారుణంగా హత్య చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా దర్యాప్తు చేస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గవర్నరుకు ఫిర్యాదు చేశారు. ఇందులో నిజాలు నిగ్గు తేలాలంటే వెంటనే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ మర్డర్ ప్లాన్ లో ఉన్నట్టు మాకు అనుమానాలున్నాయి. ఆయన ఆధ్వర్యంలోని పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేస్తే నిజాలు తెలుస్తాయని జగన్ ప్రశ్నించారు. రెండు రోజుల్లోపు ఈ కేసు సీబీఐకి అప్పగించకపోతే తాను ఈ విషయంపై కోర్టుకు వెళతానని జగన్ వెల్లడించారు. మా తాత రాజారెడ్డి హత్య చంద్రబాబు హయాంలోనే జరిగింది. మా నాన్న చనిపోవడానికి ఒక రోజు ముందు ఎవరు ఫినిష్ అవుతారో చూద్దాం అని చంద్రబాబు అసెంబ్లీ వ్యాఖ్యలు చేశారు. నాపై ఎయిర్ పోర్టులో దాడి చేశారు. ఇపుడు మా బాబాయిని చంపేశారు. కచ్చితంగా ఈ మర్డర్ కేసులో తెలుగుదేశం హస్తం ఉందని జగన్ ఆరోపణలు చేశారు.
వైయస్ వివేకానంద రెడ్డి జమ్మలడుగు ఇన్ ఛార్జ్ గా ఉండటమే ఆయన పాపం అయ్యిందని జగన్ అన్నారు. జమ్మల మడుగులో మా పార్టీ తరఫున గెలిచిన ఆదినారాయణరెడ్డి ఫార్టీ ఫిరాయించి తెలుగుదేశంలోకి పోయి మంత్రి అయ్యాడు. ఇపుడు అక్కడ మేము కొత్త అభ్యర్థి సుధీర్ రెడ్డిని నిలబెట్టాం. అతని తరఫున ప్రచారం చేయడానికి వివేకానంద రెడ్డి అక్కడకు వెళ్లాడు. అలా వెళ్లడమే ఆయన చేసిన పాపం. ఓటమి భయంతో ఈ హత్య చేయించారని జగన్ ఆరోపించారు. వివేకా ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని తెలిసి పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు పాల్పడ్డారని అన్నారు. గొడవలు లేని సౌమ్యుడు. అందుకే ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీ కూడా ఉండదు.. అలాంటి వ్యక్తిని హత్య చేయడం దారుణం అని జగన్ వివరించారు.
తెలుగుదేశం హస్తం ఉండటం వల్లే ఈ కేసును సీబీఐకి ఇవ్వడం లేదు. కడప జిల్లాలో రెండేళ్లు పూర్తి కాకుండానే ఎస్పీని మార్చారు. 40 రోజుల క్రితం ప్రస్తుత ఎస్పీ ని నియమించారు. దారుణాలు ఊహించాం. కానీ ఈ స్థాయిలో ఊహించలేదు. ఎన్నికల విధుల నుండి డిజిపి - నిఘా ఏడిజి ని తప్పించాల ని గవర్నర్ ను కోరినట్లు జగన్ చెప్పారు.