Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై కంప్లయింట్

By:  Tupaki Desk   |   15 Dec 2015 10:31 AM GMT
చంద్రబాబుపై కంప్లయింట్
X
ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్ష నేత జగన్ గవర్నరుకు ఫిర్యాదు చేశారు. కాల్ మనీ - బాక్సైట్ వ్యవహారాల్లో చంద్రబాబును తప్పుపడుతూ ఆయన గవర్నకు కంప్లయింట్లు చేశారు. మహిళలకు అధిక వడ్డీకి డబ్బులిచ్చి, వారి మానప్రాణాలతో సిగ్గులేకుండా ఆడుకున్నప్పటికీ కాల్ మనీ నిందితులపై కేసులు పెట్టడం లేదని జగన్ ఆరోపించారు. మంగళవారం ఆయన తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ నరసింహన్‌ ను కలిశారు.

బాక్సైట్ తవ్వకాల పైన చంద్రబాబు చట్టవిరుద్ధంగా వెళ్తున్నారని.. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు వేయడం లేదని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సీఎం చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలకు హత్యాయత్నం కింద కేసు పెట్టడం విడ్డూరమన్నారు. చంద్రబాబు ఎన్నోసార్లు నీ అంతు చూస్తానని అనేవారని.. దానర్థం చంపేస్తానని అనడమే అయినా ఆయనపై ఎప్పుడూ కేసులు పెట్టలేదని చెప్పిన జగన్... తమ పార్టీ ఎమ్మెల్యే కేవలం తల నరుకుతామని అన్నందుకు కేసు పెట్టడం కరెక్టు కాదన్నారు.

గుంటూరు - విజయవాడ నగరాలని మాఫియా నగరాలుగా మార్చారని జగన్ మండిపడ్డారు. ఇసుక మాఫియా - ల్యాండ్ మాఫియా.. చివరకు కాల్ మనీ మాఫియా కూడా అక్కడే వెలుగు చూస్తోందన్నారు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో పైన దాడి చేస్తే దానిపై కేసు పెట్టలేదన్నారు. ఇదే చింతమనేని ప్రభాకర్ అంగన్వాడీల పైన తిట్టరాని తిట్లు తిట్టినా చంద్రబాబు పట్టించుకోరన్నారు. సాక్షాత్తు చంద్రబాబే లిక్కర్ మాఫియాను నడుపుతూ, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా అనుమతి ఇచ్చారన్నారు. లిక్కర్ మాత్రమే కాకుండా కల్తీ మద్యం కూడా ఉందన్నారు.కాల్ మనీలో చంద్రబాబు మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల డబ్బులు ఉన్నాయన్నారు.