Begin typing your search above and press return to search.
జగన్ తో ముద్రగడ...లాజిక్ పాయింటే మరి.. ?
By: Tupaki Desk | 22 Jan 2022 10:31 AM GMTమాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సైలెంట్ గానూ ఉండగలరు, తనదైన శైలిలో దూకుడు కూడా చేయగలరు. ఆయన ఇపుడు ఏపీలో కొత్త రాజకీయాన్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ఈ మధ్యనే కాపులు, బీసీలు, దళితులతో ఒక సరికొత్త కాంబినేషన్ పోలిటికల్ గా ముందుకు రావాలని కోరుకున్నారు. ఆ మేరకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలకు లేఖలు రాశారు. ఆ కసరత్తు అలా సాగిపోతోంది.
ఇక ముద్రగడకు ఏ సమస్య మీద అయినా బహిరంగ లేఖలు రాయడం అలవాటు. ఆయన గతంలో చంద్రబాబుకు అయితే వరసబెట్టి మరీ పదుల సంఖ్యలో లేఖాస్త్రాలే సంధించేవారు. జగన్ సీఎం అయ్యాక అవి బాగా తగ్గాయి. అడపా తడపా మాత్రమే ముద్రగడ లేఖలు రాస్తున్నారు. తాజాగా ముద్రగడ జగన్ కి ఒక బహిరంగ లేఖ రాశారు. ఒక విధంగా అది ఘాటు లేఖగానే చూడాలి.
అందులో లాజిక్ పాయింట్లను తీసి మరీ ముద్రగడ గట్టిగానే వైసీపీ సర్కార్ని నిలదీశారు. ఈ లేఖలో ఆయన ప్రస్థావించిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్ అంశం తెలుగుదేశం చాలా కాలంగా విమర్శిస్తూ వస్తున్నదే. పాత ఇళ్ళు, నాలుగు దశాబ్దాల నాటి వాటికి కూడా ఓటీఎస్ వసూల్ చేయడమేంటి అని టీడీపీ ఇప్పటికే సర్కార్ మీద సమరం ప్రకటించింది. తమ ప్రభుత్వం వస్తే ఉచితంగా పేదల ఇళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా ప్రకటించింది.
అసలు ఎవరో కట్టిన ఇళ్ళకు జగన్ సర్కార్ పెత్తనమేంటి అని కూడా తమ్ముళ్ళు నిలదీశారు. సరిగ్గా ఇదే విషయాన్ని ముద్రగడ పట్టుకుని మరీ తన లేఖలో ప్రస్థావించారు. అక్కడితో ఆయన ఆగకుండా ఓటీఎస్ పేరిట గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్ళకు సొమ్ము వసూల్ చేసే అధికారం మీకెక్కడి అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం చెల్లించని జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పధకాన్ని ఎలా వర్తింపచేస్తారు అని ఆయన లాజిక్ పాయింట్ నే తీశారు. ఓటీఎస్ పేరిట పేద ప్రజల మీద వత్తిడి తీసుకురావద్దు అంటూ డిమాండ్ చేశారు.
ఇక ముద్రగడ ఇప్పటిదాకా వైసీపీకి అనుకూలమని ఒక విమర్శ ఉంది. దాంతో ఆయన చంద్రబాబుని ప్రతీసారీ విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో ఆయన జగన్ సర్కార్ మీద ఒక పాలసీకి సంబంధించి ప్రశ్నించడం ద్వారా తానేంటి అన్నది చెప్పారు అంటున్నారు. అంతే కాకుండా ఓటీఎస్ టీడీపీ వారి ఆయుధంగా ఉంది. దాన్ని ముద్రగడ తీసుకోవడం ద్వారా టీడీపీకి వారికి ప్రియం కలిగించారు అనుకోవాలి.
మరి రానున్న రోజుల్లో ఇదే తీరున విపక్షాలు లేవనెత్తిన అనేక అంశాలు, ప్రజా సమస్యల మీద జగన్ సర్కార్ ని అడిగేందుకు ముద్రగడ సిద్ధపడిపోతున్నారా అంటే అవును అనే అంటున్నాయి పరిణామాలు. సో ముద్రగడ వైపు నుంచి ఆయుధాలు రెడీ. ఇక కాచుకోవాల్సింది వైసీపీ ప్రభుత్వమే మరి.