Begin typing your search above and press return to search.
రాజ్‌నాథ్ ఏం చెప్పారు జగన్..?
By: Tupaki Desk | 11 Jun 2015 1:35 PM GMTఏపీ ప్రజలకు సంబంధించి ఏదైనా కష్టం వస్తే..మాట కూడా మాట్లాడని విపక్ష నేత జగన్.. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బాబును విమర్శించే అవకాశం నిద్రలో వచ్చినా వదిలిపెట్టని జగన్.. ఓటుకు నోటు వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడటం తెలిసిందే.
గత కొద్దిరోజులుగా బాబు సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆయనకు తగ్గట్లే..ఆయన పత్రికలోనూ భారీస్థాయిలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. చివరకు అవి ఏస్థాయికి చేరాయంటే.. బాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవి ఎవరికి వస్తుందన్న ఊహాగానాలతో వార్తల వంటకం చేసేసి అచ్చేస్తున్నారు.
తాజాగా ఢిల్లీలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన జగన్.. ఏపీ ముఖ్యమంత్రి మీద ఓటుకు నోటు ఇష్యూలో కేసు నమోదు చేయాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఏడాది చంద్రబాబు అవినీతి పాలన మీద దర్యాప్తు చేయాలని కోరినట్లు కూడా వెల్లడించారు.
విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు.. కేంద్రం నుంచి అందాల్సిన సాయాలకు సంబంధించి ఒక కాపీ ఇచ్చినట్లు చెప్పిన జగన్.. చంద్రబాబు టాపిక్ ను ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారన్న అంశాన్ని రాజ్‌నాథ్‌కు వివరించినట్లు చెబుతున్నారు. ఇన్ని చెబుతున్న జగన్.. తన మాటలకు రాజ్‌నాథ్ ఏ విధంగా స్పందించారన్న అంశాన్ని మాత్రం చెప్పలేదు చూశారా..?