Begin typing your search above and press return to search.
జగన్ మంత్రి వర్గం ఈ వీడియో చూడాల్సిందే.. ఎందుకంటే!
By: Tupaki Desk | 16 Jun 2022 3:30 AM GMTఏపీ సీఎం జగన్ మంత్రి వర్గం.. ఈ వీడియో చూడాల్సిందేనని.. అంటున్నారు మేధావులు. ఇక, ఈ ఫొటోలు, వీడియోల్లో చీపురు పట్టుకుని ఊడూస్తూ.. చెత్తను ఏరుతున్న నాయకుడు... కేంద్ర మంత్రి! ఆయన మన రాష్ట్రానికి చెందిననాయకుడు కాదు. పైగా.. మన రాష్ట్ర అధికార పార్టీ ఎంపీ కూడా అసలే కాదు. అయినా.. కూడా ఆయన చీపురు పట్టి.. శుభ్రం చేస్తూ.. చెత్తను ఏరుతూ.. ఇంటింటికీ తిరిగి.. కరపత్రాలు పంచుతూ.. అధినేత(ప్రధాని మోడీ) ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. దేశవ్యాప్తంగా మోడీ ఆదేశాల మేరకు.. మంత్రులు.. పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఎల్. మురగన్.. కాకినాడ నగరపాలక సంస్థ లోని 26వ వార్డులో పర్యటించారు.
మంగళవారం రాత్రి అక్కడే నిద్ర చేసిన ఆయన.. ఉదయాన్నే సచివాలయాన్ని శుభ్రం చేశారు. కసువు ఊడ్చి.. ఎత్తి చెత్తబుట్టలో వేశారు. అనంతరం నాగరాజుపేట లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసారు. పథకాలు సరిగా అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు.
కట్ చేస్తే.. మన రాష్ట్రంలోనూ వైసీపీ నాయకులు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ప్రజల మధ్య ఉండాలని.. ప్రబుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని.. ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తెరమీదికి తెచ్చారు.
అయితే.. ఇది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అంతేకాదు.. ప్రజలతో మమేకం కావల్సిన నాయకులు.. ప్రజలపై దూషణలకు దిగారు. అంతేకాదు. కనీసం.. ప్రజలను ఆకట్టుకునేందుకు.. ఇలాంటి పనులు కూడా చేయాలనే ఆలోచనకు రాలేక పోయారు.

మొత్తంగా నెటిజన్లు చెబుతున్నది ఏంటంటే.. అధినేత ఆదేశాలను అమలు చేయడంలోనే నేతల అభిమానం.. పప్రజల పట్ల విధేయత బయటపడుతుందని అంటున్నారు. కేంద్రంలోని మోడీ ఆదేశించాక.. ఆ ఆదేశాలను తూచ. తప్పకుండా అంకిత భావంతో అమలు చేస్తున్న మురగన్.. ఎక్కడ.. ఎప్పుడెప్పుడు.. కార్యక్రమానికి తెరదించి ఇంటికెళ్లి రెస్టు తీసుకుందామనుకున్న మన నాయకులు ఎక్కడ? అని పెదవి విరుస్తున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి శ్రమదానం వీడియో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.