Begin typing your search above and press return to search.
టీడీపీని కార్నర్ చేసిన జగన్.. ఇబ్బందిలోకి నెట్టేశారుగా!
By: Tupaki Desk | 11 March 2022 3:45 AM GMTఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. టీడీపీ ని భారీ ఎత్తున కార్నర్ చేశారు.అదేసమయంలో వారిని.. ఆత్మరక్ష ణలో పడేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల వికేంద్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నటుడు బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని.. సత్యసాయి జిల్లాకు కేంద్రంగా మార్చాలని బాలయ్య ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనరెండు రోజుల పాటు. హిందూపురంలో ఆందోళన కూడా నిర్వహించారు.
తాజాగా ఆయా అంశాలపై సభలో మాట్లాడిన సీఎం జగన్.. టీడీపీని కార్నర్ చేశారు. హిందూపురంని జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో .. ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం జగన్.. అదేదో తన బావ చంద్రబాబు అధికారంలో ఉండగా ఆ పని చేయించుకోవచ్చు కదా, ఇప్పుడు నన్నెందుకు అడుగుతావు బాలయ్యా అని అసెంబ్లీలో అన్నారు . దీంతో టీడీపీ నేతలకు సౌండ్ లేకుండా పోయింది.
అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నచిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పైనా జగన్ ఆసక్తిగా స్పందించారు.
కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ టీడీపీ గొడవ చేస్తోందని, అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేసుకోవచ్చు కదా అంటూ మరో సెటైర్ పేల్చారు.
అంటే అధికారంలో ఉండగా.. కనీసం ఆ దిశగా ఆలోచించని చంద్రబాబు, బాలకృష్ణ.. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, ఆవేదన వెళ్లగక్కడం, ఆందోళనలకు దిగడం హాస్యాస్పదం అని ఒక్క మాటలో వారి పరువు తీసేశారు. మరి జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.