Begin typing your search above and press return to search.
జగన్ హాజరు పై సీబీఐ కి హైకోర్టు ఏం చెప్పింది?
By: Tupaki Desk | 28 Jan 2020 10:45 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల వెనుక అసలుచరిత్ర అందరికి తెలిసిందే. ఏళ్లకు ఏళ్లుగా ఈ కేసులపై విచారణ సాగుతున్న సంగతి పాత విషయమే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్.. ఆ పాత కేసుల విచారణ కోసం ప్రతివారం కోర్టుకు హాజరు కావటం పాలనా పరంగా ఇబ్బంది గా మారే పరిస్థితి. ఇలాంటివేళ.. తనకు కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు.
అయితే.. జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇవ్వటం.. తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యం లో ఇదే అంశంపై జగన్ హైకోర్టు ను ఆశ్రయించారు. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్ తాజాగా హైకోర్టు విచారణ కు వచ్చింది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ ను ఫిబ్రవరి ఆరు కు వాయిదా వేశారు. గత శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయింపును కొట్టి వేస్తూ.. తప్పని సరిగా హాజరు కావాలని సీబీఐ కోర్టు కోరింది. ఈ నేపథ్యం లో తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరీ విషయం లో సీబీఐ కౌంటర్ లోని అంశాలు ఎలా ఉండనున్నాయి? అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.