Begin typing your search above and press return to search.

జగన్ హెలికాప్టర్‌ లో వెళ్లడం మానుకుంటేనే మంచిదా?

By:  Tupaki Desk   |   23 Sep 2019 10:49 AM GMT
జగన్ హెలికాప్టర్‌ లో వెళ్లడం మానుకుంటేనే మంచిదా?
X
ఏపీ సీఎం జగన్ మోహనరెడ్డి హెలికాప్టర్ పర్యటనల విషయంలో అధికారులు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదని.. టేకాఫ్ - ల్యాండింగులకు సంబంధించిన ప్రామాణిక జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ భద్రతపై వైసీపీలో కలవరం మొదలైంది. ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయి.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా.. లేకుంటే కుట్ర కోణాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలూ మొదలవుతున్నాయి.

జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్‌‌ కు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేక్ ఆఫ్‌ విషయంలో వివాదం చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. హెలికాప్టర్‌ టేక్ ఆఫ్‌ కు సమస్యలు ఉన్నాయని అధికారులు సమాచారం ఇవ్వడంతో సీఎం కార్యాలయం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు సమస్య ఏంటని ప్రశ్నించిన అధికారులకు - విమానాశ్రయ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై విచారించి - చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కు సీఎంఓ ఆదేశాలు పంపింది. ఆ మరుక్షణమే సర్వే శాఖ డీఐ వేణు కు కలెక్టర్‌ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హెలికాప్టర్‌ టేక్ ఆఫ్‌ కు అనుమతి లభించాక ఆయన హైదరాబాద్ వెళ్తారు.

మరోవైపు ఇటీవల వరదకు గురైన కర్నూలు జిల్లాలో జగన్ పర్యటించినప్పుడు కూడా ఇలాగే జరిగిందని చెబుతున్నారు. నంద్యాలలో సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై తప్పుడు సమాచారం అందించినట్టు సీఎం కార్యాలయం గుర్తించింది. దాంతో ఆగ్రహించిన సీఎం కార్యాలయం.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై డీఆర్ ఓ మరియు అధికారులు విచారణ జరుపుతున్నారు. జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలపై నిర్లక్షంగా వ్యవహరించిన అధికారి వేణుపై తప్పదని వైసీపీవర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో జగన్ హెలికాప్టర్ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.