Begin typing your search above and press return to search.

జగన్ మీడియాను అలా రుద్దేస్తున్నారా?

By:  Tupaki Desk   |   12 Dec 2022 5:35 AM GMT
జగన్ మీడియాను అలా రుద్దేస్తున్నారా?
X
సంక్షేమ పథకాల్ని తనదైన శైలిలో అమలు చేసే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాతే ఎవరైనా. ఒక సంక్షేమ పథకాన్ని రెండు ముక్కలు లేదంటే నాలుగు ముక్కలు చేసి.. ప్రతి మూడు నెలలకు ఒకసారి సదరు పథకానికి సంబంధించిన తర్వాతి ఫేజ్ ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా ప్రకటనల మోత మోగించే విషయంలో జగన్ సర్కారు తర్వాతే ఎవరైనా అని చెబుతారు.

ఇదిలా ఉంటే.. తమ చేతిలో అధికారం ఉండి కూడా తమ మీడియా సంస్థను కొత్త రికార్డుల దిశగా అడుగులు వేయించలేకపోతున్నామన్న భావన ఉన్నట్లుగా చెబుతారు. అందుకే తాజాగా కొత్త ఎత్తుగడకు తెర తీశారన్న మాట వినిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు ప్రతి నెల జగన్ మీడియా సంస్థకు చెందిన పత్రికను కొనుగోలు చేసేందుకు వీలుగా కొత్త ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా ప్రతి నెలా వారికి రూ.200 చొప్పున కట్టాల్సిన మొత్తాన్ని కట్టేలా కొత్త ఎత్తుగడకు తెర తీశారని చెబుతారు. ఇలా చేయటం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లోని 2.5 లక్షల వలంటీర్లు నిత్యం తమ పత్రికను చందాదారులుగా మారేలా ప్లాన్ వేశారిన చెబుతున్నారు. అలా చేయటం ద్వారా.. రూ.100 కోట్ల మేర అదనపు ఆదాయం చందాల రూపంలో వస్తుందని భావిస్తున్నారు.

సీఎం జగన్ మానస పుత్రిక అయిన సచివాలయాల నిర్వహణకు నెలకు రూ.10వేల చొప్పున ఇవ్వాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్నా.. వాటి విషయంలో నిర్ణయం తీసుకోని ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులకు తమ పత్రికకు అవసరమైన చందా కోసం మాత్రం నిధుల్ని విడుదల చేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2.5 లక్షల మంది వలంటీర్లు.. లక్ష మంది సచివాలయ ఉద్యోగుల చేత మొత్తంగా నెలకు నాలుగు లక్షల మంది ద్వారా రూ.200 చొప్పున విడుదల చేయటం ద్వారా రూ.100 కోట్ల మొత్తాన్ని జమ చేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారంలో తాము ఉన్నాం కాబట్టి.. తమకున్న అధికారాన్ని ఉపయోగించి భారీగా ప్రయోజనం పొందేందుకు ముఖ్యమంత్రి వారి మీడియా సంస్థను ప్రత్యేక ప్లాన్ అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ తీరుపై విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. రానున్న రోజుల్లో మరేం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.