Begin typing your search above and press return to search.
టీడీపీ- జనసేనలకు జగన్ కొత్త పేర్లు
By: Tupaki Desk | 21 Nov 2022 8:09 AM GMTఏపీ సీఎం జగన్.. తాజాగా నరసాపురంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో జగన్ విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా టీడీపీపై తీవ్ర విమర్శలతో పాటు ఏకకాలంలో వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. టీడీపీని.. తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని దుయ్యబట్టారు. ఇక, నుంచి టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
అదేసమయంలో జనసేన పార్టీ నాయకుడు రౌడీ భాష మాట్లాడుతున్నాడని జగన్ విమర్శించారు. జనసేన కాదు.. అది రౌడీ సేన అంటూ విరుచుకుపడ్డారు. రౌడీ సేనలు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని .. ఇదంతా కూడా తెరవెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో అందరికీ తెలుసునని జగన్ వ్యాఖ్యానించారు.
"ఒకవైపు దత్తపుత్రుడు, మరో వైపు అసలుపుత్రుడిని వెంటబెట్టుకుని వెళ్లారు. ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు తరిమికొట్టారు" అని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు బెదిరిస్తున్నారని జగన్ అన్నారు. తన సొంత నియోజకవర్గంలోనూ ఆయనను ఓటమి ఆహ్వానిస్తోందని తెలుసుకుని ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బాబును ఎందుకు గెలిపించాలని ఆయన ప్రశ్నించారు.
ఏం చేశారని గెలపించాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిరాశ నిస్పృహల్లో చంద్రబాబు కూరుకుపోయారని జగన్ అన్నారు. ప్రశ్నిస్తానని చెప్పిన వారు ప్రశ్నించడం మానేసి.. పొత్తులు పెట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "అధికార భగ్న ప్రేమికుడు చంద్రబాబు" అని జగన్ వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.