Begin typing your search above and press return to search.
జగన్ ఓకే : వైసీపీ ఎమ్మెల్యేలూ...పండుగ చేసుకోండి...?
By: Tupaki Desk | 2 July 2022 11:30 AM GMTఏ ముహూర్తాన గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట వైసీపీ కార్యక్రమం చేపట్టిందో కానీ నాటి నుంచే ఆ పార్టీకి మబ్బులన్నీ తొలగిపోయి వాస్తవాలు కంటికి కనిపించడం జరిగింది. ఇక పార్టీ ప్లీనరీలలో ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు గొంతు సవరించుకున్నాక కానీ కధ పాకాన పడింది అన్న సంగతి కూడా పూర్తిగా తెలిసిరాలేదు. మరో వైపు ఇదే ప్లీనరీలలో కార్యకర్తల నిలదీతలు కూడా షరా మామూలుగా సాగిపోయాయి. మొత్తానికి మూడేళ్ళుగా పార్టీకి పట్టిన మబ్బు గబ్బు అన్నీ కూడా అధినాయకత్వం కళ్లకు పూర్తిగా కనిపించేయడం జరిగింది.
దాంతో ఒక విధంగా మేలు జరిగిందా అంటే అవును అనే పార్టీ వర్గాలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న జగన్ కి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తమ మొరను సవ్య దిశలోనే వినిపించారు అని అంటున్నారు. మొత్తానికి అధినాయకత్వానికి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ బాగా అర్ధమయ్యాయని అంటున్నారు. దాంతో పనిచేసే క్యాడర్ కోసం ప్రత్యేక పధకాన్ని తీసుకుని వస్తామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కర్నూల్ ప్లీనరీలో తాజాగా చెప్పుకొచ్చారు.
ఇపుడు ఒంగోలు జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన హాట్ హాట్ కామెంట్స్ కి కూడా ప్రతిఫలం దక్కబోతోందని అంటున్నారు. వేణుగోపాల్ అన్నదేంటి అంటే జగన్ బటన్ నొక్కి నగదు బదిలీ చేస్తూ తన గ్రాఫ్ బాగా పెంచుకున్నారని, ఎమ్మెల్యేలుగా తాము ప్రజల తరఫున ఏ ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని, అలా తమ గ్రాఫ్ పడిపోయింది అని మనసులో ఉన్నది బయటకు కక్కేశారు. దాంతో హై కమాండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ మీదట ఏం చేయాలో కూడా ఆలోచించింది అంటున్నారు.
ఇక జగన్ సైతం దీని మీద సీరియస్ గానే దృష్టి పెట్టారు అంటున్నారు. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు గానూ 12 కోట్ల రూపాయలను ఒక్కో నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాలని బోల్డ్ డెసిషన్ జగన్ తీసుకున్నారు అని తెలుస్తోంది. అంటే ఇందులో ముందుగా రెండు కోట్లను ఎమ్మెల్యేలకు ఇస్తారు. ఆ సొమ్ము పూర్తిగా ఎమ్మెల్యేలు తమ విచక్షణతో అభివృద్ధికి ఖర్చు చేస్తారు.
అలాగే మరో పది కోట్ల రూపాయలను రెండు విడతలుగా ఇస్తారు. ఈ నిధులతో పూర్తిగా నియోజకవర్గం అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. అంటే మద్దిశెట్టి వేణుగోపాల్ చెప్పినట్లుగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఇతర మౌలిక సదుపాయాలు అన్న మాట. అవసరం అయిన చోట దీని కంటే కొంత మొత్తం ఎక్కువగా ఇవ్వడానికి వైసీపీ సర్కార్ సుముఖంగా ఉందని అంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళకు జగన్ ఎమ్మెల్యేల మొర ఆలకించారు అంటున్నారు.
ఎమ్మెల్యేలు కోరుకున్న మేరకు నిధులు వారికి అందబోతున్నాయి. అలా వారు ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా తమ గ్రాఫ్ పెంచుకోవడానికి వీలుంటుంది. ఇంకోవైపు చూస్తే ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో జగన్ సమావేశాలు నిర్వహిస్తారు అని అంటున్నారు.
అలాగే గడప గడపకు కార్యక్రమంతో పాటు జిల్లాలలో పార్టీ ప్లీనరీలు జరిగిన తీరుతెన్నున మీద వైసీపీ పెద్దలు తెప్పించుకున్న నివేదికలు ఎమ్మెల్యేల ముందు పెడతారని అంటున్నారు. బాగా పనిచేసిన వారికి కితాబులు. లేని వారికి క్లాసులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే చివరి రెండేళ్ళల్లో ఎమ్మెల్యేలు, క్యాడర్ విషయంలో వైసీపీ సర్కార్ ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. దీని ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.