Begin typing your search above and press return to search.
ఏపీ రాజధానిపై జగన్ భారీ ముందడుగు
By: Tupaki Desk | 15 Dec 2019 6:44 AM GMTగ్రాఫిక్స్ లో ఏపీ రాజధాని అమరావతిని చూపించి కోట్ల రూపాయలు తగలేసి ఐదేళ్లైనా పూర్తి చేయని చంద్రబాబు గుణపాఠం ఓ వైపు మెదులుతూనే ఉంది. కోట్లు ఖర్చు పెట్టిన బాబు అమరావతిలో మొండిగోడలు మిగిల్చిన అసమర్థత కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అందుకే గద్దెనెక్కిన సీఎం జగన్.. అమరావతి విషయంలో ఆచితూచి పకడ్బందీ ప్రణాళికలను రూపొందించారు.
ఒకే సారి ఉట్టికి నిచ్చెన కట్టి అమరావతిని ప్రపంచపటంలో నిలిపే బాబు ప్లాన్లకు జగన్ స్వస్తి పలికారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏపీ రాజధానిని విడతల వారీగా అభివృద్ధి చేసే నయా ప్లాన్ ను సిద్ధం చేశారు.
తాజాగా అమరావతికి ఐఐటీ నుంచి నిపుణులను ఏపీ సర్కారు పిలిపిస్తోంది. రాజధానిలో రోడ్లు, మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరించాలని ఏపీ సర్కారు ప్లాన్ చేసింది.
అంతేకాదు.. వారి సూచనలకు అనుగుణంగా పారదర్శకంగా అవినీతి రహితంగా రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు అప్పగించి రాజధానికి ఓ రూపు తేవడానికి జగన్ సర్కారు ప్లాన్ చేసింది.
ఇప్పటికే చంద్రబాబు, పచ్చ మీడియా అమరావతిని వైసీపీ సర్కారు మారుస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్న వేల అమరావతి విషయంలో జగన్ వేసిన ముందడుగు చూశాక ఇప్పటికైనా వారి నోళ్లకు తాళాలుపడుతాయో చూడాలి.
- Dinakar