Begin typing your search above and press return to search.

బీసీలు మీ వెంటో మా వెంటో తేల్చుకుందా

By:  Tupaki Desk   |   28 Jan 2019 11:08 AM GMT
బీసీలు మీ వెంటో మా వెంటో తేల్చుకుందా
X
రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సభకు వచ్చినవాళ్లంతా టీడీపీకే ఓటు వేస్తారా అనేది తర్వాతి విషయం. అయితే ఈ సభ ద్వారా బీసీలకు తాము అండగా ఉంటున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అన్నింటికి మించి అసలు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. అలాగే బీసీలకు వైఎస్ ఆర్‌ అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ వైఎస్ ఆర్‌ ని డైరెక్ట్‌ గా టార్గెట్‌ చేసేసరికి వైసీపీ ఆత్మరక్షణలో పడింది. రేపటి రోజున జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లినప్పుడు వైఎస్‌ ని - ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్నే ప్రస్తావించాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏకంగా బీసీలకు అన్యాయం చేసింది వైఎస్‌ అనేసరికి.. వైసీపీ కూడా బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రూపొందించడం మొదలుపెట్టింది. అందులో భాగంగా..టీడీపీకి ధీటుగా తాము కూడా ఒక బీసీ బహిరంగ సభను త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది.

ఏపీలో ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిరోహించాలన్నా దానికి బీసీల మద్దతు చాలా అవసరం. జనాబాలో ఎక్కువుగా ఉన్న బీసీలు ఎవరికైతే గంపగుత్తగా ఓటు వేస్తారో.. ఆ పార్టీ గెలవడం ఖాయం. అందుకే.. వైసీపీకి ప్రధాన బలంగా ఉన్న బీసీ ఓటర్లుని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్ని తిప్పికొడుతూనే.. వైఎస్‌ ఏం చేశారు - రాబోయే రోజుల్లో జగన్‌ ఏం చేయబోతున్నారు అనే విషయాల్ని బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియ చెప్పాలని ప్లాన్‌ చేస్తోంది వైసీపీ.