Begin typing your search above and press return to search.
బుట్టా రివర్స్!... జగన్ ఏమంటారో?
By: Tupaki Desk | 9 March 2019 10:44 AM GMTకర్నూలు ఎంపీగా ఫస్ట్ టైంలో బంపర్ మెజారిటీతో నేరుగా పార్లమెంటులోనే అడుగుపెట్టిన బుట్టా రేణుక పరిస్థితి ఇప్పుడు రెంటికీ కాని రేవడిలానే తయారైందని చెప్పాలి. అధికార పార్టీలో కొనసాగడమే లక్ష్యంగా బుట్టా దంపతుల ప్లాన్ నిజంగానే బెడిసికొట్టింది. వ్యాపారాల్లో బాగానే రాణించిన బుట్టా ఫ్యామిలీ... రాజకీయాల్లోనూ తామనుకున్నట్లు జరుగుతుందని, జరగాలని భావించి బొక్క బోర్లా పడిన పరిస్థితి ఇప్పుడు నిజంగానే ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల ఫలితాలు రాగానే... భార్య వైసీపీ ఎంపీగా ఉండగానే... బుట్టా రేణుక పతి నీలకంఠం అధికార పార్టీ టీడీపీలో చేరిపోయారు. ఆ వెంటనే రేణుక కూడా పార్టీ మారడం ఖాయమే అనుకున్నా... ఒకింత సమయం వెయిట్ చేసిన రేణుక... ఎట్టకేలకు అందరూ అనుకున్నట్లుగానే టీడీపీకి జైకొట్టారు.
అయితే పరిస్థితి రివర్స్ పంచ్ కొట్టింది. వైసీపీలోనే ఉండి ఉంటే... ఈ దఫా కూడా కర్నూలు ఎంపీ టికెట్ బుట్టాదే. అయితే ఎంపీ కంటే కూడా ఎమ్మెల్యేగా ఉండాలన్న బుట్టా అత్యాశ... వారి పరిస్థితిని తారు మారు చేసింది. ఇప్పుడు బుట్టా పరిస్థితి ఏమిటంటే... అటు ఎమ్మెల్యే సీటుతో పాటు ఇటు సిట్టింగ్ ఎంపీ టికెట్ కూడా బుట్టాకు దక్కే పరిస్థితి లేదు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిపోవడంతో ఎంపీ టికెట్ ను బుట్టా వదులుకోక తప్పని పరిస్థితి. తాను అనుకున్నట్టుగా ఎమ్మెల్యే టికెట్ అయినా దక్కుతుందా? అంటే ఎక్కడికక్కడ అభ్యర్థులు ఖరారైపోయారు. సో.... టీడీపీలో ఈ దఫా ఎన్నికలకు సంబంధించి బుట్టాకు టికెట్ దక్కదని తేలిపోయింది. ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వస్తే... ఐదేళ్లు తిరక్కుండానే ఇలా టికెట్ దక్కని పరిస్థితి ఎదురవుతుందని బుట్టా ఫ్యామిలీ ఊహించి ఉండదు.
మరి ఇప్పుడు ఏం చేద్దాం... అన్న ఆలోచనలో పడిపోయిన బుట్టా దంపతులు తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నారట. నాడు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే... చేయిచ్చేసి వైరి వర్గంలో చేరిపోయిన బుట్టాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీ ఎంట్రీకి అనుమతిస్తారా? ఏమో.,.. ఓ సారి ప్రయత్నిస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు అవే యత్నాలను ప్రారంభించేసిన బుట్టా... జగన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని వణికిపోతున్నారట. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా... బుట్టా యత్నాలు దాదాపుగా ఫలించే అవకాశాలే కనిపించడం లేదనే వాదనలే వినిపిస్తున్నాయి. చూద్దాం... ఏం జరుగుతుందో?