Begin typing your search above and press return to search.

వైసీపీ ఆ బలంపైనే బాబు ఫోకస్.. జగన్ స్టెప్ ఏంటి?

By:  Tupaki Desk   |   28 March 2019 4:55 AM GMT
వైసీపీ ఆ బలంపైనే బాబు ఫోకస్.. జగన్ స్టెప్ ఏంటి?
X
ఎన్నికల్లో గెలవాలంటే బలం.. బలగం రెండూ ఉండాలి.. ప్రత్యర్థుల బలం, బలహీనతలు తెలిసి ఉండాలి. ఎదుటివారి బలహీనతలను బలంగా మార్చుకోవాలి. వారి బలంపై దెబ్బ కొట్టాలి.. ప్రత్యర్థి పార్టీకి ఎక్కడైతే బలముందో అక్కడే ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీపై టీడీపీ ఇలాంటి వ్యూహాన్నే అమలు చేస్తోంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న వారి ఓట్లపై దెబ్బతీస్తోంది. మరి అనాదిగా తమ వెంట ఉన్న వారిపై ప్రతిపక్ష నేత జగన్ ఏం చేస్తారు? ఎలా ముందుకెళ్తారనే దానిపై ఆసక్తిగా మారింది.

ఎన్నికల్లో సామాజిక పరిణామాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ధేశించేది ఇదే. అందుకే ఇప్పుడు చంద్రబాబు రాయలసీమలో ప్రబలంగా ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో మైనార్టీలు ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా కడప - కర్నూలు - అనంతపురంలో వీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. వీరి ప్రోద్బలంతోనే గడిచిన 2014 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ మెజార్టీ సీట్లు సాధించింది. అప్పుడు బీజేపీతో కలిసి టీడీపీ ఇక్కడ ఓడిపోయింది.

కానీ ఇప్పుడు బీజేపీకి బద్ద వ్యతిరేకిగా మారిన చంద్రబాబు వైసీపీకి ఆదినుంచి సపోర్టుగా ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకుపై కన్నేశారు. దాన్ని చేజిక్కించుకునేందుకు జాతీయ మైనార్టీ నేతలను రంగంలోకి దించుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను తీసుకొచ్చిన జగన్ పై విషం కక్కించారు.

రాయలసీమలోని మైనార్టీలు ప్రస్తుతానికి వైసీపీ వెంటే ఉన్నారు. వారిని టీడీపీకి మార్చి లబ్ది పొందాలని బాబు వేసిన ఈ స్కెచ్ ను జగన్ ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది. నిజానికి చంద్రబాబు కంటే జగనే ముస్లిం మైనార్టీ - బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కువ సీట్లు ఇచ్చారు. వారి ఆర్థిక స్థోమత చూడకుండా వారి శక్తి సామర్థ్యాలు చూసి ఇచ్చారు. అందుకే మైనార్టీలు వైసీపీ వెంట ఉన్నారు. వీరిని దూరం చేసే బాబు ఎత్తుగడను జగన్ ఎలా అడ్డుకుంటారనే దానిపైనే సీమలో పార్టీల విజయావకాశాలున్నాయి. మరి జగన్ ఏం చేస్తారన్నది ఆసక్తి మారింది.