Begin typing your search above and press return to search.
ఆ ఎంపీని జగన్ వదలడా?
By: Tupaki Desk | 9 Aug 2019 1:49 PM GMTకియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ను గౌరవించి ఆయనకు దేశంలోని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తే అక్కడ అసందర్భంగా ప్రవర్తించి పార్టీకి అప్రతిష్ట కలిగేలా - ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తించారు. అంతేగాకుండా జగన్ నిర్ణయాలను కూడా వక్రీకరించి మాట్లాడారు. మాధవ్ వ్యవహరించిన తీరు సాటి వైకాపా నేతలనే విస్మయానికి గురిచేసింది అంటే... మాధవ్ ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుంది.
కియాలో స్థానికేతరులకే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చారన్న మాట నిజమే అయినా దానిపై అంతర్జాతీయ మీడియా ముందు అసందర్భంగా వ్యక్తీకరించడం - ప్రభుత్వ ఉద్దేశాలు పారిశ్రామిక వేత్తలకు తప్పుగా అర్థమయ్యేలా మాధవ్ ప్రవర్తించిన తీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే... కొత్తగా పెట్టే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నది నిబంధన. ఇప్పటికే నెలకొల్పిన కంపెనీలు దశల వారీగా స్థానికులను ఎక్కువగా తీసుకోవాలనేది నిబంధన. దీనికి దాదాపు మూడేళ్ల సమయం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికిపుడు పాత వారిని తీసేసి కొత్తగా స్థానికులను తీసుకోవాలంటే... కంపెనీ అన్నిరకాలుగా నష్టపోతుంది. అందుకే ప్రభుత్వం నిర్ణీత గడువు ఇస్తూ నిబంధనలు రూపొందించింది.
కియా ప్రతినిధులతో గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికిపుడు స్థానికులకు అవకాశాలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులతో వ్యాఖ్యానించడం - శుభాకాంక్షలు చెప్పాల్సిన చోట నిరసన వ్యాఖ్యలు రాయడం - ప్రతిపక్షం విమర్శలు చేస్తే... ఉద్దేశాన్ని విపులంగా వివరించాల్సిన చోట ముఖ్యమంత్రి జగన్ కు చెప్పి కియా మెడలు వంచిస్తా... ఇంకా చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు అని అనడం వైసీపీకి - రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. అందుకే ఈ విషయంలో ఎంపీ కి చీవాట్లు తప్పవని తెలుస్తోంది. తనను కలవాలని గోరంట్ల మాధవ్ కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి చాలామంది వైసీపీ నేతలు జగన్ గురించి ఊహించుకున్నది వేరు - జరుగుతున్నది వేరు. పదవులను తమ ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలనుకునే నేతలకు చెక్ పెట్టే విధంగా జగన్ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. తాజాగా ఈరోజు జగన్ పెట్టుబడుల సదస్సులో చేసిన ప్రసంగం వింటే ఈ విషయం అర్థమవుతుంది. ప్రతి విషయంలో దూరదృష్టి - సుపరిపాలన కోణంలో నిర్ణయాలు ఉంటున్నాయి. 75 శాతం కోటా గురించి మరోసారి ఈరోజు స్పష్టం చేసిన జగన్ అది కేవలం ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయం కాదని - శాంతి భద్రతలకు సంబంధించిన నిర్ణయం అని చెప్పారు. పరిశ్రమలు వచ్చినపుడు స్థానికులకు భూమి - నీరు - కాలుష్యం విషయంలో కొంత నష్టం జరుగుందని దానిని పూర్తి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ఉద్యోగ హామీ ఇస్తే పరిశ్రమల స్థాపన ప్రశాంతంగా ఉంటుందన్నది తమ ఉద్దేశం అని జగన్ స్పష్టంగా చెప్పారు. అంటే ప్రతి నిబంధన రూపకల్పన విషయంలో ఇంత కచ్చితత్వం ప్రభుత్వం పాటిస్తుంటే... స్థాయికి మించి విజయం దక్కిన వెంటనే ఇష్టానుసారం ప్రవర్తిస్తూ కొందరు నేతలు పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. అయితే, ఇలాంటి వారిపై ఓ కన్నేసిన ప్రభుత్వం ఎప్పటికపుడు వారిని హెచ్చరిస్తూ వస్తోంది. మొన్నే మంత్రుల పేషీల్లో అవినీతి మచ్చ ఉన్న వారిని తొలగించమని చెప్పినా... అలాగే కొనసాగిస్తున్న కొందరు మంత్రులను మందలించిన జగన్ గోరంట్ల మాధవ్ చేసిన తప్పు అంత ఈజీగా క్షమించరని చెప్పొచ్చు. తొలి వేదిక మీదే ఆరు నెలల నుంచి ఏడాది లోపు మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అని ఛాలెంజ్ చేసిన జగన్ ఇలాంటివి అంత సులువుగా ఇగ్నోర్ చేయకపోవచ్చని చెప్పాలి.