Begin typing your search above and press return to search.
జగనొచ్చారు..ఏపీలో ఐఏఎస్ లకు కొరత వచ్చేసింది
By: Tupaki Desk | 26 May 2019 4:15 AM GMTఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విపక్ష పార్టీ హోదాలో బరిలోకి దిగిన వైసీపీ... రికార్డు విక్టరీని నమోదు చేసింది. 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లను - 25 ఎంపీ సీట్లలో 22 సీట్లను వైసీపీ గెలిచింది. ఈ మేర వైసీపీకి దక్కిన విజయాన్ని రికార్డు విజయంగానే చెప్పక తప్పదు. రికార్డు విజయం సరే గానీ... వైసీపీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్ ఈ నెల 30న సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మరి తర్వాతి పరిస్థితి ఏంటి?
పాదయాత్రలోనే కాకుండా.... జనంతో మమేకమైన ప్రతి సందర్భంలోనూ జగన్ చాలా హామీలనే ఇచ్చారు. ఈ హామీల్లో తాను అధికారంలోకి వస్తే... ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. రాఫ్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానని జగన్ చెప్పారు కదా. ఒక్కసారి హామీ ఇస్తే... జగన్ వెనక్కు తగ్గరు కదా. అంటే... 25 జిల్లాల ఏర్పాటు కూడా ఖాయమే కదా. మరి కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటైతే... ఇప్పుడున్న 13 జిల్లాలకు సరిపడ ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులే రాష్ట్రంలో లేరు. మరి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అధికారులకు కొరతే కదా. మరి ఆ కొరతను అధిగమించడం ఎలా?
రాష్ట్ర స్థాయి పోస్టులు అయితే.. ఏపీపీఎస్పీ ద్వారా ఎలాగోలా భర్తీ చేసుకోవచ్చు. మరి ఐఏఎస్ - ఐపీఎస్ లంతా సివిల్ సర్వీసుల నుంచి వచ్చే వారు కదా. కేంద్రం నిర్ణయం ఆధారంగానే వారి కేటాయింపు జరుగుతుంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ తరహా పరిస్థితే ఇప్పుడు తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాల పాలనతో పాటు రాష్ట్ర పాలనలోనూ కలెక్టర్లదీ కీలక భూమిక కదా. ఆ పోస్టుకు సరిపడ ఐఏఎస్ లు ఉంటేనే పాలన సాఫీగా సాగుతుంది. మరి సరిపడినంత మంది ఐఏఎస్ లు - ఐపీఎస్ లు లేకుండా జగన్ కొత్త జిల్లాల ఏర్పాటును ఎలా చేస్తారో చూడాలి.