Begin typing your search above and press return to search.
అన్నీ సానుకూలతలే.. బాబుతో కానిది జగన్ చేసేస్తారా?
By: Tupaki Desk | 5 Jun 2019 1:48 PM GMTతెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు. ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్న అంశం. ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పాటు అటు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు... లెక్కకు మిక్కిలి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి, లెక్కలేనన్ని లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వడివడిగానే పడిపోతున్నాయి. అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా సానుకూల అంశాలు నెలకొన్న వేళ... ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపును జగన్ సాధించినా ఆశ్చర్యపోనక్కర లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే... జగన్ రికార్డు సృష్టించనట్టేనని చెప్పక తప్పదు.
అయినా ఇప్పుడు జగన్ కు కలిసి వస్తున్న అంశాలేమిటన్న విషయానికి వస్తే... జమ్మూ కాశ్మీర్ లో అధికారం చేపట్టే దిశగా పక్కా ప్రణాళికను రచిస్తున్న బీజేపీ.... ఆ రాష్ట్రంలో హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతంలో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. చాన్నాళ్లుగా వినిపిస్తున్న ఈ డిమాండ్ ను నెరవేర్చడం ద్వారా బీజేపీ మైలేజీ సాథించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు మరో ఏడాదిలోగా ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పావులు కదుపుతున్నారు. ఈ చర్యలు ప్రారంభం కాగానే... తెలుగు రాష్ట్రాల విషయాన్ని కూడా తెర మీదకు తీసుకుని రావడం ద్వారా జగన్ కేంద్రంపై ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి అంశాన్ని పట్టుకుని జగన్ తనదైన మంత్రాంగం నెరిపే అవకాశాలున్నాయి.
కాశ్మీర్ లో సీట్లను పెంచితే... జగన్ కోరికను బీజేపీ నేతలు పక్కనపెట్టే అవకాశాలు దాదాపుగా లేనట్టే. అంటే... కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా కాశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల పెంపును తనకు సానుకూలంగా మలచుకునే జగన్... ఏపీలోనూ అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని కేంద్రం తీర్చాల్సిన అనివార్య అంశంగానే మార్చనున్నారు. ఇదే జరిగితే... ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కు పెరుగుతాయి. అదే సమయంలో తెలంగాణలోని 119 స్థానాలు కాస్తా 150కి పెరుగుతాయి. మొత్తంగా బీజేపీ తనకు లాభం చేకూర్చేలా తీసుకునే నిర్ణయాన్నే ఆసరా చేసుకునే జగన్ అసెంబ్లీ సీట్ల పెంపును సాధించే అవకాశాలున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, తెలంగాణకు రెండో దఫా సీఎం పగ్గాలు చేపట్టిన కేసీఆర్ లతో కానిది జగన్ కానిచ్చేస్తారన్న మాట.