Begin typing your search above and press return to search.
లక్ష్మీపార్వతికి జగన్ వరమెప్పుడు?
By: Tupaki Desk | 14 Aug 2019 1:33 PM GMTలక్ష్మీపార్వతి...రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ రెండో భార్యగా - అన్న టీడీపీ అధ్యక్షురాలుగా - ప్రస్తుతం వైసీపీలో ముఖ్య నాయకురాలుగా లక్ష్మీపార్వతి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒంటికాలిమిద లేచే నేతల్లో లక్ష్మీపార్వతి ముందు వరుసలో ఉంటుంది. 2014 ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో కొనసాగుతూ వస్తున్న ఆమె...చంద్రబాబు - నారా లోకేశ్ లపై ఏ స్థాయిలో విమర్శలు చేసేవారో అందరికీ తెలుసు. ఇక 2014 నుంచి మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ అవినీతిని - చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలని మీడియా ద్వారా ఎండగట్టేవారు.
వైసీపీ తరపున మీడియా చర్చల్లో ఆమె గత కొన్నేళ్లుగా పార్టీ వాయిస్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ కూడా ఆమెకు పార్టీలో పదవి ఇవ్వడం ద్వారా మంచి ప్రయార్టీనే ఇచ్చారు. ఇక మొన్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చి - జగన్ సీఎం కావడం - టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలనలో దూకుడుగా వెళుతున్నారు.
అలాగే అటు మంత్రి పదవులు దక్కనివారికి నామినేటెడ్ పదవులు కూడా కట్టబెడుతున్నారు. ఇప్పటికే చాలమందికి పదవులు వరించాయి. ముఖ్యంగా మహిళల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా - వాసిరెడ్డి పద్మలకు పదవులు వచ్చాయి. రోజా ఏపిఐఐసి ఛైర్మన్ ఇవ్వగా - వాసిరెడ్డి పద్మకి మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ వీరితో పాటు పార్టీ కోసం కష్టపడిన లక్ష్మీపార్వతికి ఇంకా ఏ పదవి రాలేదు. అయితే జగన్ మాత్రం ఆమెకు ఏదొక మంచి పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీని ముప్పుతిప్పలు పెట్టె ఆమెకు పదవి ఇస్తే పార్టీకి మేలు అని ఆయన భావిస్తున్నారు. ఎమ్మెల్సీ గానీ, ఏదైనా నామినేటెడ్ పదవి గాని ఆమెకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. చూడాలి మరి జగన్ ఆమెకి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో. జగన్ మాత్రం ఆమె గౌరవానికి తగిన పదవే ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.