Begin typing your search above and press return to search.

వారెవ్వా.. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీసర్ల రాజ్యమా!

By:  Tupaki Desk   |   1 Aug 2019 7:00 AM GMT
వారెవ్వా.. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీసర్ల రాజ్యమా!
X
తాము అధికారం చేపట్టగానే జగన్ మోహన్ రెడ్డి తన మంత్రులకు స్పష్టమైనా ఆదేశాలు ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో నియమితం అయిన అధికారులను సాగనంపాలని జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాల్లో అధికారుల పాత్రను కూడా జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లాబీయిస్టులుగా మారిపోయారని గత ఐదేళ్లూ అదే జరిగిందని జగన్ భావించారు.

అందుకే కీలకమైన సెక్రటేరియట్ లో తెలుగుదేశం హయాంలో నియమితం అయిన అధికారులపై బదిలీ వేటు వేయాలనే తర్కాన్ని జగన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే అప్పటికే లాబీయింగ్ కు అలవాటు అయిన ఆ అధికారులు కొత్త మంత్రులను - నేతల వద్ద కూడా బాగానే లాబీయింగ్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అలా వారు తమ తమ స్థానాల్లో యథాతథంగా కొనసాగుతూ ఉన్నారని, వారు గతంలోలాగే వ్యవహరిస్తూ ఉన్నారని సమాచారం.

తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు అయిన వాళ్లే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ ఉన్నారని - టీడీపీ ఓడిపోయినా ఆ పార్టీకి సన్నిహితులైన వారి మాట మాత్రం సాగుతూ ఉందనని సమాచారం. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా తెలుగుదేశం అధికారుల రాజ్యమే కొనసాగుతోందనే టాక్ వస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. మరి ఈ పరిస్థితి పై స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదిలోనే సర్క్యులర్ జారీ చేసినా మార్పు అయితే కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.