Begin typing your search above and press return to search.
బాబుకు ఆశపెట్టడానికే అసెంబ్లీ సీట్ల పెంపు
By: Tupaki Desk | 27 Jan 2018 5:32 AM GMTతెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం చాలాకాలంగా సద్దుమణిగి ఉన్నప్పటికీ నాలుగు రోజులుగా ఇది హాట్ టాపిగ్గా మారింది. సీట్లు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని... ఈ ఎన్నికల నాటికి ఏపీలో 225 సీట్లకు పోటీ ఉంటుందని టీడీపీ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. అయితే... ఇందులో నిజానిజాలెంతన్న విషయంలో కేంద్రం నుంచి మాత్రం క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న వాదన వాస్తవానికి అత్యంత దగ్గరగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల సరికి ఇదేమీ జరగబోదని ఆయన తనను పాదయాత్రలో కలుస్తున్న నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన జరగదన్న ధీమాను జగన్ కనబర్చినట్లు సమాచారం. గత కొద్దిరోజుల నుంచి పాదయాత్రలో తనను కలిసేందుకు వస్తున్న ఎంపీలు - ఎమ్మెల్యేలు - నియోజకవర్గ నేతలతో జగన్.. ఢిల్లీ నుంచి తనకు వచ్చిన సమాచారాన్ని వివరించి - భయపడాల్సి పనిలేదని భరోసా ఇస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ పునర్విభజన ప్రక్రియను ఏపీ క్యాబినెట్ ఆమోదిస్తుందని... అయితే, క్యాబినెట్ ఆమోదం తర్వాత దానిని పార్లమెంటులో చర్చకు పెడతారని - అది అక్కడి నుంచి ముందుకు కదలదని జగన్ అన్నట్లు సమాచారం.
అక్టోబర్ - నవంబర్ లో లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని.. కేవలం చంద్రబాబు తృప్తి కోసమే బీజేపీ అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఫైళ్లను అటూఇటూ తిప్పితే తిప్పొచ్చని - కాంగ్రెస్ దీనిని తప్పకుండా వ్యతిరేకిస్తుందని జగన్ అన్నట్లుగా చెబుతున్నారు. కొన్నాళ్లుగా దిల్లీలో పరిణామాలను పరిశీలిస్తున్న ఎంపీ ఒకరు దిల్లీ పరిణామాలను జగన్ కు ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్లు సమాచారం.