Begin typing your search above and press return to search.

ఆ రెండు క‌ష్ట‌మే.. జ‌గ‌న్ స‌ర్కార్‌ తాజా జీవో ఎఫెక్ట్ ఎంత‌...?

By:  Tupaki Desk   |   8 Jan 2023 2:30 AM GMT
ఆ రెండు క‌ష్ట‌మే.. జ‌గ‌న్ స‌ర్కార్‌ తాజా జీవో ఎఫెక్ట్ ఎంత‌...?
X
రాజ‌కీయాలు ఎప్పుడు ఎలాంటి మ‌లుపైనా తిరగొచ్చు. ``ఇలా మేం చేసి ఉంటే.. నువ్వు అడుగు బ‌య‌ట పెట్టేవాడివా?!`` అని చంద్ర‌బాబు ఆవేద‌న‌, ఆక్రోశం, ఆందోళన వ్య‌క్తం చేయొచ్చు. కానీ, ఈ ఆలోచ‌న ఆయ‌న చేయ‌క‌పోవ‌డం.. త‌ప్పు ముమ్మాటికీ జ‌గ‌న్ ది కాదు. ఇక ప్ర‌త్య‌ర్థుల‌ను లొంగ‌దీసుకునేందుకు ప్ర‌భుత్వాలు అనేక‌రూపాల్లో ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి. గ‌తం నుంచి ఈ ప‌ద్ధ‌తులు ఉన్న‌వే.

సో.. ఈ క్ర‌మంలోనే జీవో 1/2023 జ‌గ‌న్ తీసుకువ‌చ్చార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించ‌డం త‌ప్పుకాదు. లేదు.. మేం ప్ర‌జ‌ల‌కోసం.. తీసుకువ‌చ్చామ‌ని వైసీపీ వారు వాదించ‌నూ త‌ప్పుకాదు. వెర‌సి.. ఇక్క‌డ చ‌ర్చ ఇప్పుడు ఈ జీవో క‌న్నా.. రెండు కీల‌క ఘ‌ట్టాల‌పైనే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌టి ఈ నెల 27న ప్రారంభం కానున్న టీడీపీ యువ నాయ‌కుడు లోకేష్ పాద‌యాత్ర, రెండు.. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ప‌వన్ క‌ళ్యాణ్ వారాహి బ‌స్సు యాత్ర.

మొత్తంగా.. ఈ రెండు యాత్ర‌ల‌పై టీడీపీ, జ‌న‌సేన‌లు బాగానే ఆశ‌లు పెట్టుకున్నాయి. అయితే.. తాజాగా ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో 1 ఆధారంగా వీటికి స‌ర్కారు బ్రేకులు వేస్తుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోం ది. అయితే.. నిజంగానే ఈ జీవో అలా చేస్తుందా? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌ధానంగా.. ఈ జీవోలో రోడ్ల‌పై షోలు చేయ‌డానికి వీలు లేదు. ఇది వారాహికి ఇబ్బంది క‌లిగించ‌డం ఖాయం.

అదేస‌మ‌యంలో రోడ్ల‌పై స‌భ‌లు పెట్ట‌డానికి వీల్లేదు. ఇది కూడా ఇబ్బందే. సో.. ఈ జీవోతో ప‌వ‌న్‌కు ఇబ్బం ది త‌ప్ప‌దు. అయితే.. నారా లోకేష్ పాద‌యాత్ర‌కు ఇబ్బంది ఉండే అవ‌కాశం లేద‌ని నిపుణులు చెబుతు న్నారు. ఎందుకంటే.. పాద‌యాత్ర చేయొద్ద‌ని జీవోలోలేదు. కేవ‌లం వాహ‌నాల గురించే పేర్కొన్నారు. అయితే.. గ్యాద‌రింగ్ పెర‌గ‌కుండా.. లిమిటెడ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌నుక ఆయ‌న పాద‌యాత్ర చేసుకుంటే ఇబ్బంది ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా చూస్తే.. జీవో ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని వెసులుబాట్లు ఉండ‌నే ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.