Begin typing your search above and press return to search.

ఏపీలో సీట్ల పెంపు... జ‌గ‌న్ - బాబు ఎవ‌రికి ప్ల‌స్‌!

By:  Tupaki Desk   |   25 July 2019 2:30 PM GMT
ఏపీలో సీట్ల పెంపు... జ‌గ‌న్ - బాబు ఎవ‌రికి ప్ల‌స్‌!
X
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ - పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రారంభంలో ప్ర‌ధాన‌మంత్రి మోడీ సైతం ఏపీ - తెలంగాణలో నియోజకవర్గాల పెంపున‌కు సుముఖంగానే ఉన్నారు. తర్వాత ఈ బిల్లుపై కాలయాపన జరగడంతో పాటు ఏపీలో టిడిపికి.... కేంద్రంలో బిజెపికి మధ్య తీవ్రమైన గ్యాప్ రావడంతో పునర్విభజన అంశం క్ర‌మ‌క్ర‌మంగా ప‌క్క‌కు వెళ్లిపోయింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో లబ్ది పొందాలని చాలా ప్రయత్నాలు చేసినా అవన్నీ క‌ల‌గానే మిగిలిపోయాయి.

అప్ప‌ట్లో టీడీపీ అనుకూల ప‌చ్చ మీడియా అయితే ప్రతిరోజూ నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగిపోతున్నాయి అంటూ బ్యాన‌ర్ వార్త‌లు ప్ర‌చురించేవి. అప్పట్లో విపక్ష పార్టీలకు చెందిన నేతలను ఆకర్షించే ప‌న్నాగం ఉందన్నది కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి సీఎం చంద్రబాబు సైతం అనేక సార్లు ఢిల్లీ వెళ్లి నియోజకవర్గాల పెంపు పై ప్రధానితో సహా బిజెపి కీలక నేతలతో చర్చించారు. చివరకు మోడీ 2024 నాటికి చూద్దామంటూ దాటవేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన కేంద్రం పట్టించుకోలేదు. తిరిగి రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

తెలంగాణలో మరోసారి టిఆర్ ఎస్ అధికారం వ‌స్తే.... ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో పాటు ఓ బిల్లును పార్లమెంటుకు సమర్పించింది. ఈ లెక్క‌న ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా మ‌రో 50 యాడ్ అవుతాయి. తెలంగాణ‌లో ఉన్న 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు మ‌రో 34 సీట్లు క‌లుస్తాయి. ఈ రెండు మ‌రో ఒక‌టి రెండు సంవ‌త్స‌రాల్లో నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగితే అది ఖచ్చితంగా ఏపీలో జ‌గ‌న్‌ - తెలంగాణ‌లో కేసీఆర్‌ కు ప్ల‌స్ అవుతుంది.

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో వైసీపీలో బండి ఓవ‌ర్ లోడ్ అయ్యింది. చాలా మంది నేత‌లు ప‌ద‌వుల కోసం ఆశిస్తున్నారు. మ‌రో ప‌దేళ్ల పాటు జ‌గ‌న్‌ దే భ‌విష్య‌త్తు అని భావిస్తోన్న వారు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో కొత్త‌గా 50 సీట్లు పెరిగితే వారికి వైసీపీలో అనేక అవ‌కాశాలు వ‌స్తాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా పెరిగే ఎమ్మెల్సీలు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ‌తాయి. ఇక టీడీపీలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చాలా చోట్ల పోటీ చేసేందుకు స‌రైన అభ్య‌ర్థులు లేరు. కొత్త‌గా 50 సీట్లు పెరిగితే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలా చోట్ల బ‌ల‌మైన అభ్య‌ర్థులే దొర‌క‌ని ప‌రిస్థితి.

సీట్లు పెరిగితే వైసీపీకి అభ్య‌ర్థులు ఉండ‌ర‌ని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ఎద్దేవా చేసింది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి నిజంగా టీడీపీకి వ‌చ్చింది. ఇక జ‌న‌సేన గ‌త ఎన్నిక‌ల్లోనే 175 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను పోటీ పెట్ట‌కుండా బీఎస్పీ - క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి పోటీకి దిగింది. మ‌రి ఇప్పుడు సీట్లు పెరిగితే ఆ పార్టీ ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఏదేమైనా ఏపీలో సీట్ల పెంపు జ‌గ‌న్‌ కు చాలా అడ్వాంటేజ్ అవుతుంది.