Begin typing your search above and press return to search.
నెలరోజుల్లో ఆ ఎన్నికలు పూర్తిచేయండి
By: Tupaki Desk | 3 March 2020 9:58 AM GMTరెండేళ్ల కిందట జరగాల్సిన ఎన్నికలు ఇప్పటివరకు నిర్వహించేలేదు. అప్పట్లో అధికారంలో ఉన్న వారు స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా వాయిదా వేయగా.. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. మార్చి 31లోపు ఎన్నికలు నిర్వహిస్తే దాదాపు రూ.మూడు వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రానికి అందే అవకాశం ఉంది. ఆలోపు ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అత్యవసరంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేవలం నెలలోపు అంటే 30వ తేదీలోపు ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారంట. దీంతో రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని వినిపిస్తున్న మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన పంచాయతీ, పరిషత్ ఎన్నికలు 2018 ఆగస్టుతో పదవీకాలం ముగిసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు హయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అంటే 2018లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆయన వాయిదా వేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తే దానిలో పరాభవం ఎదురవుతదని భావించి నిర్వహించలేదు. ఆ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనే భయంతో వాయిదా వేయగా ఆ వాయిదా ఇప్పటివరకు కొనసాగుతోంది.
అయితే ఈ ఎన్నికలు 2020 మార్చి 31వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆ నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.3,200 కోట్లు రాష్ట్రానికి దక్కకుండా పోయే పరిస్థితి ఎదురైంది. దీన్ని గుర్తించిన సీఎం జగన్ ఎన్నికల నిర్వహణపై మూడు రోజులుగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సిద్ధమవాలని పార్టీ నాయకులు - కార్యకర్తలకు కూడా సూచనలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఎటు తిరిగి ఈనెలాఖరులోపు ఎన్నికలు పూర్తి కావాల్సిందే. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకే ఇటీవల జగన్ పర్యటనలను మానేసి పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో ఉండాలని గతంలోనే సూచనలు జారీ చేశారు. అత్యధిక స్థానాలు గెలుపొందేలా మంత్రులకు టార్గెట్ కూడా జగన్ విధించారు. ఫలితాల్లో తేడా ఉంటే మంత్రి పదవికి గండం ఉంటుందని పరోక్ష హెచ్చరికలు కూడా చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే మూడు రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.