Begin typing your search above and press return to search.
కృష్ణా జిల్లాలోకి జగన్ యాత్ర ఎంట్రీ!..జనం పోటెత్తారు!
By: Tupaki Desk | 14 April 2018 8:04 AM GMTవచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు నెలల క్రితం ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర నేటి ఉదయం రాష్ట్రంలోని కీలక జిల్లాగా పరిగణిస్తున్న కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టింది. గుంటూరు జిల్లాలో జన హోరు మధ్యన జరిగిన ఈ యాత్ర... కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సందర్భంగా జిల్లాలోకి జగన్ యాత్రకు ఘన స్వాగతం లభించింది. కిలో మీటరుకు పైగా పొడవున్న వారధి మొత్తం జగన్ అభిమాన సంద్రంతో నిండిపోయింది. గుంటూరు జిల్లా నేతలు జగన్ వెంట వారధి ఎక్కగా... విజయవాడ వైపున మరో ఎండ్‌లో కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నేతలు... జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలతో పాటు సామాన్య జనం కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో వారధి ఎంట్రెన్స్ తో పాటు వెరటర్నటీ హాస్పిటల్ - శిఖామణి సెంటర్ - బందరు రోడ్డు - ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాలన్నీ జన హోరుతో మారుమోగిపోయాయి.
జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ యాత్రకు మంచి బూస్ట్ ఇచ్చేలా... మొన్నటిదాకా టీడీపీలో కొనసాగిన విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే - టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సమీప బంధువు యలమంచిలి రవి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రవి వెంట ఆయన అనుచరులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. రవితో పాటు ఆయన ముఖ్య అనుచరులకు జగన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. మొత్తంగా జగన్ కు జిల్లాలోకి స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు - సామాన్య జనం - యలమంచిలి రవి అనుచర వర్గం ఇకేసారి వారధి వద్దకు చేరుకోవడంతో అక్కడ భారీ జన సందోహం నెలకొంది. పార్టీ వర్గాలు ఊహించిన దాని కంటే జగన్ యాత్రకు భారీ స్వాగతం లభించడంతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొందనే చెప్పాలి. టీడీపీకి మంచి పట్టు ఉందని భావిస్తున్న విజయవాడలో జగన్ యాత్రకు జనం నుంచి భారీ స్పందన రావడం నిజంగానే ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి.
జిల్లాకు చెందిన పార్టీ నేతలు కొలుసు పార్థసారధి - కొడాలి నాని - వంగవీటి రాధాకృష్ణ - మల్లాది విష్ణు - సామినేని ఉదయభాను - వెలంపల్లి శ్రీనివాస్ తదితర నేతలు పెద్ద సంఖ్యలో అనుచర గణంతో తరలివచ్చారు. వారధి ఎంట్రెన్స్ వద్ద జగన్ యాత్ర నగరంలోకి ప్రవేశించే సమయంలో పోటెత్తిన జనం సదోహం నేపథ్యంలో ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి చేయి దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక జగన్ కు స్వాగతం పలుకుతూ... కృష్ణా నదిలో నిలుచుకున్న కొందరు పార్టీ అభిమానులు పార్టీ జెండాలను వరుసగా నిలబెట్టిన తీరు జనాన్ని ఆకట్టుకుంది. అంతేకాకుండా వారధికి ఓ వైపున ఉన్న రెయిలింగ్ కు సాంతం వైసీపీ జెండాను ఏర్పాటు చేసిన వైనం కూడా బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. వారధి ఆ వైపు నుంచి ఈ వైపు దాకా ఏకవస్త్రంగా కనిపించిన ఈ భారీ జెండా యాత్రకు హైలెట్ గా నిలిచిందని చెప్పక తప్పదు.
నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగే జగన్ యాత్ర నేటి సాయంత్రానికి నగరంలోని చిట్టినగర్ సెంటర్‌కు చేరుకోనుంది. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి జగన్ ప్రసంగించనున్నారు. జగన్ ప్రసంగం వినేందుకు నగర జనం అమితాసక్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చిట్టినగర్ సభకు భారీగా జనం తరలిరానున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల గుండెల్లో వణుకు పుట్టించిన జగన్ యాత్ర.... కృష్ణా జిల్లాలోనూ అంతకుమించి అన్న రీతిలో సాగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.