Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాలో ఊపు మీద జగన్..

By:  Tupaki Desk   |   14 Aug 2018 5:39 AM GMT
ఉత్తరాంధ్రాలో ఊపు మీద జగన్..
X
ఉభయ గోదావరి జిల్లాలలో ప్రజల నుంచి సానుకూలత - అత్యంత ఆధారాభిమానాలు పొందిన వైఎస్‌ ఆర్ పార్టీ నాయకుడు జగన్ మోహన రెడ్డి తన ఉత్తరాంధ్ర పర్యటనను కూడా అదే రూట‌్‌ లో కొనసాగిస్తున్నారు. ప్రసంగాలలోను - హామీలలోను స్పష్టత పాటిస్తున్న జగన్‌ కు ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ ద్వారం విశాఖలో ఘన స్వాగతం లభిస్తోంది. సామాన్యులు - మధ్యతరగతి వారు ఉద్యోగులు - రైతులు - మహిళలు విద్యార్దిని - విద్యార్దుల నుంచి అపురూప ఆదారణ వెల్లువెత్తుతోంది. జగన్ పాదయాత్రలో రోజురోజుకు కాలుకలుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడి పాలనతో విసిగిపోయిన ఉత్తరాంధ్ర ప్రజలు జగన్‌ కు అడుగడుగున నీరజనం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు - రైతుల నుంచి వస్తున్న స్పందన అనూ‍హ్యంగా ఉందంటున్నారు. అసాధ్యమైన హామీలివ్వకుండా ప్రజలను మోసం చేసే ప్రసంగాలు కాకుండా ముందుకు అడుగేస్తున్న జగన్ వెంట విశాఖ ప్రజలు కదులుతున్నారు.

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల వైఖరిపై ప్రజలలో తీవ్ర అసంత్రుప్తి ఉంది. విశాఖపట్నంలో భూముల కుంభకోణం మంత్రులు అయ్యన్నపాత్రుడు - ఘంటా శ్రీనివాసుల మధ్య నెలకొన్న వైరం జిల్లావాసులను కలవరపెడుతోంది. దీంతో వారంతా జగన్ మోహాన రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తెలగుదేశం ఎమ్మేల్యేల అవినీతి కూడా ప్రజలలో చర్చగా మారుతోంది. వీరి అవినీతిని అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టనట్టుగా వ్యవహరించడం కూడా జిల్లావాసులలో ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాకు చెందిన మంత్రులు - ప్రజాప్రతినిధుల తీరుపై అధికారులలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాథికారులు ప్రజాప్రతినిధుల అవినీతిపై ముఖ్యమంత్రికినేరుగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయిన సీఎం చంద్రబాబు నాయుడు మిన్నకుండిపోతున్నారు. ఈ వ్యవహార శైలితో ప్రజలలో తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకత జగన్‌ పై అభిమానంగా మారుతోంది. ప్రజలలో గూడు కట్టుకున్న ఈ ప్రేమాభిమానాలు జిల్లాలోకి జగన్ ప్రవేశించడంతో బహిర్గతమవుతున్నాయి.

విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన జగన్ ఎక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంలేదు. హమీల వర్షమూ కురిపిచండంలేదు. ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు పడుతున్న కష్టాలు వారి నుంచే నేరుగా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు జగన్ పాదయాత్రలో ఎక్కువగా పాల్గుంటున్నారు. ఇదీ జగన్‌ పై సానుకూలతకు నిదర్శనం. జగన్ అధికారంలోకి వస్తే - ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తమ కష్టాలు తీరుతాయని విశాఖ వాసులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న హామీ - రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామన్న హామీని తుంగలో తొక్కారనే భావన విశాఖ ప్రజలలో నాటుకుంది. అలాగే విశాఖకు రైల్వే జోన్‌ పై కూడా చంద్రబాబు నాయడు మాట తప్పారని జిల్లా వాసులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామాలతో ఉత్తారాంధ్ర ప్రజలు జగనే తమ ముఖ్యమంత్రిగా కావాలని ఆశిస్తున్నారు.