Begin typing your search above and press return to search.
జగన్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్.. కారణమిదే!
By: Tupaki Desk | 18 Oct 2018 4:48 AM GMTఎండ.. వాన.. చలి.. ఇలాంటి అవరోధాల్ని పెద్దగా పట్టించుకోకుండా.. ప్రజల దగ్గరకు వెళ్లాలి.. వారితో మమేకం కావాలి. వారి కష్టాలు తెలుసుకోవాలి. వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. కొత్త ఆశలు కల్పించాలి. వారికి నా అండ ఉందన్న భరోసా ఇచ్చేందుకు మొదలెట్టిన ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నెలల తరబడి సాగుతున్న సంగతి తెలిసిందే.
ఆరోగ్య సమస్యలు ఎదురైనా.. ప్రకృతి సవాళ్లు విసిరినా పట్టించుకోకుండా.. ముందుకెళ్లున్న జగన్ పాదయాత్రకు ఒక రోజు బ్రేక్ పడనుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో జగన్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర స్టార్ట్ చేసి 288 రోజులు అవుతోంది.
బొబ్బిలిలో పర్యటిస్తున్న జగన్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది.ఈ రోజు దసరా కావటంతో.. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. జిల్లా నాయకులు.. కార్యకర్తలతో పాటు.. పాదయాత్రలో శ్రమిస్తున్న సిబ్బంది అభ్యర్థనపై జగన్ స్పందించారు. దసరా పండుగ జరుపుకోవటానికి వీలుగా ఈ రోజు (గురువారం) పాదయాత్రకు ఒక రోజు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ.. శుక్రవారం ఉదయం నుంచి జగన్ పాదయాత్ర షురూ కానుంది.