Begin typing your search above and press return to search.
ఈ రోజు జగన్ పాదయాత్ర ఎలా సాగుతుందంటే..
By: Tupaki Desk | 6 Nov 2017 5:19 AM GMTఏపీ అధికారపక్షానికి నిద్ర లేకుండా చేస్తున్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర షురూ అయ్యింది. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్.. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తొమ్మిది గంటలకు సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
తనను కలిసేందుకు.. తనకు అండగా నిలుస్తామన్న సంకేతాన్ని ఇచ్చేందుకు వేలాదిగా తరలి వచ్చిన నేతలు.. కార్యకర్తలు.. అభిమానులతో కి్క్కిరిసింది. ఇక.. ఈరోజు సాగే పాదయాత్ర ఎలా జరగనుంది? అన్నది చూస్తే..
ఉదయం తొమ్మిదిన్నరకు పాదయాత్రను ప్రారంభించే జగన్.. మారుతి నగర్ మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసిన తర్వాత కాసేపు ఆగి.. మధ్యాహ్నం మూడు గంటల వేళ మళ్లీ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
అనంతరం వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు. ఈ రోజు మొత్తంగా ఏడెనిది కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే జగన్ నడవనున్నారు. మంగళవారం నుంచి మాత్రం షెడ్యూల్ వేరుగా ఉంటుంది. ఉదయం ఏడు కిలోమీటర్లు.. సాయంత్రం ఏడు కిలోమీటర్ల చొప్పున నడవనున్నారు. రాత్రి వేళ జగన్ విశ్రమించేందుకు వీలుగా టెంట్లను ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నానానికి కమలాపురం నియోజకవర్గం లోని వీరపునాయునిపల్లో మండలం లోకి ప్రవేశించనుంది. మంగళవారంరాత్రి ఈ మండలంలోనే ఆయన విశ్రమించనున్నారు.