Begin typing your search above and press return to search.

జ‘గన్’ ఫైర్: వైజాగ్ వెళతా.. అరెస్ట్ చేస్తారా?

By:  Tupaki Desk   |   25 Jan 2017 4:05 PM GMT
జ‘గన్’ ఫైర్: వైజాగ్ వెళతా.. అరెస్ట్ చేస్తారా?
X
జ‘‘గన్’’ ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీయువత ఉత్సాహంతో ముందుకు వస్తుంటే.. అడ్డుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి తీరును తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డఆయన.. రేపు (గురువారం) విశాఖలో నిర్వహించే శాంతి నిరసనలో తాను పాల్గొననున్నట్లు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. హోదా సాధన కోసంచేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకుంటున్న చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదా సాధన కోసం ఏపీ యువత విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర మౌన నిరసనను చేపట్టాలని నిర్ణయించుకోవటం తెలిసిందే. ఇందుకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే పిలుపునివ్వగా.. అదే రోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించాలనిఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్.. కొవ్వొత్తుల ప్రదర్శనలో తాను కూడా పాల్గొంటానని చెప్పారు.

ఆర్కే బీచ్ దగ్గర నిర్వహించే ర్యాలీలో పాల్గొనకుండా చంద్రబాబు సర్కారు ఆంక్షలు విధించటంపై స్పందిస్తూ.. ‘‘నేను కూడా ర్యాలీలో పాల్గొంటా. అరెస్ట్ చేస్తారా? చేస్తే చేయనివ్వండి. శాంతియతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి ఆటంకాలు కలిగించొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా. చంద్రబాబు కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి. ప్రత్యేక హోదాకోరుకునేప్రతిఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని తమ ఆకాంక్షను వ్యక్తం చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు యువత ముందుకు వస్తుంటే.. ర్యాలీ జరపొద్దంటూ చంద్రబాబుఆంక్షలు పెట్టటం ఏమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు పాలన చూస్తుంటే.. బ్రిటీషు పాలనలో ఉన్నట్లు ఉందన్న ఆయన.. యువభేరి సదస్సులకు వచ్చే విద్యార్థులపై పీడీ కేసులు పెడతామని చెబుతున్నారని.. కేసుల్ని విద్యార్థులపై కాకుండా చంద్రబాబుపై టాడా కేసు పెట్టి జైల్లో పెట్టాలంటూ మండిపడ్డారు. హోదా విషయం మీద తాము జూన్ వరకూ వెయిట్ చేస్తామని..అప్పటికికేంద్రం సానుకూలంగా స్పందించని పక్షంలో..జూన్ తర్వాత రాజీనామాలు చేసేస్తామని చెప్పారు. తమ పార్టీ ఎంపీలు మొత్తం రాజీనామాలు చేస్తారంటూ వెల్లడించారు. హోదా కోసం తాము చేస్తున్న ఉద్యమంలో బాబు కలిసి వస్తే సంతోషమని..ఒకవేళ బాబుకాని కలిసిరాకపోతే.. దేవుడు ఆయన్ను కచ్ఛితంగా బంగాళాఖాతంలోకలుపుతారన్నారు.

ప్రత్యేక హోదా మీద తమ పార్టీకి సంబంధించిన వెబ్ సైట్లో వివరాల్ని వివరంగా పెట్టినట్లుగా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభంతో పాటు.. హోదా అక్కర్లేదంటూ చేసే అర్థం లేని వాదనలకు లాజిక్ గా సమాధానాల వివరాలు వివరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఇప్పటివరకూ తాము ఎంతగా ప్రయత్నించినవివరాలుకూడావాటిల్లో పొందుపర్చినట్లుగా చెప్పిన జగన్.. గురువారం ఆర్కే బీచ్ లోని నిర్వహించే నిరసన కాకుండా ఇప్పటివరకూ 32 నిరసన కార్యక్రమాల్ని నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రత్యేక హోదా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక్కడితోనే జరుగుతుందని చెప్పటం లేదు. రేపు.. మర్నాడో హోదావస్తుందని చెప్పటం లేదు.పోరాటం అన్నది చేయకపోతే.. ఇది ఇక్కడితో ఆగిపోతుంది. పోరాటం చేస్తూ ఉంటే..ఇవాళ కాకుంటే రేపు అయినా సాధించుకునే వీలు ఉంటుంది’’ అని చెప్పారు.

‘‘తెలంగాణ రాష్ట్రం అసాధ్యమనుకున్నదే సాధించుకోగలిగిన పరిస్థితిని చూశాం. పార్లమెంటును సాక్షిగా చేసుకొని ఇచ్చిన మాటను మనం సాధించుకోలేకపోతే.. నిజంగా అందరం సిగ్గుతో తల వంచుకోవాలి. ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలి. మొన్ననే తమిళనాడులో జల్లికట్టు విషయంలో.ఒక ఆటకు సంబంధించిన విషయంలోమొత్తం తమిళనాడులోని అన్ని పొలిటికల్ పార్టీలు ఏకమయ్యాయి. అందరూ పొలిటికల్ పార్టీ లీడర్లను తీసుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు వద్దని చెప్పిన తర్వాత కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కలుపుకొని సాధించుకున్న పరిస్థితిని మనం చూశాం. ఒక ఆట విషయంలోనే వారంతా కలిసి కట్టుగాప్రయత్నించారు. ఇది మనకు జీవన్మరణ సమస్య.. హోదాతో ఉద్యోగాలు వస్తాయనితెలిసి కూడా.. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోతున్నారంటే.. ఆయనసిగ్గుతో తల వంచుకోవాలి’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/