Begin typing your search above and press return to search.
సొంతింటికి కూడా అద్దె కడుతున్న జగన్
By: Tupaki Desk | 30 Jun 2016 12:15 PM GMTఏపీలో విపక్ష నేత - వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ తన కంపెనీలు - ఆస్తుల విషయంలో చూపించిన లెక్కల్లో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. సీబీఐ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు చేసి ఈడీ తాను చేపట్టిన విచారణలోనూ మనీ లాండరింగ్ జరిగినట్లు నిర్ధారించింది. అక్రమంగా ఆర్జించిన డబ్బును భార్య భారతి - ఇతరుల పేర్లతో జగన్ తనకే చెందిన వివిధ కంపెనీల్లోకి మళ్లించారని ఆరోపణలుండడంతో ఈడీ ఆ ఆస్తులను అటాచ్ చేసింది.
ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో లోటస్ పాండ్ లోని జగన్ సొంత ఇల్లు కూడా ఉంది. జగన్ నివాసం - వైసీపీ ఆఫీసు కూడా అయిన ఆ ఇంటికి జగన్ అద్దె చెల్లిస్తున్నట్లుగా రికార్డుల్లో ఉంది. ఆ ఇంటి నిర్మాణానికి మూడు సంస్థల ద్వారా నిధులు సమకూర్చినట్లుగా ఉంది.
ఉటోపియా ఇన్ఫ్రా స్ట్రక్చర్సు - మరో రెండు సంస్థలు నిధులు సమకూర్చి ఆ ఇంటిని కట్టాయట. దీంతో ఇల్లు ఆ సంస్థలకు చెందినదిగా చూపించారు. ఆ కంపెనీల నుంచి జగన్ ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లుగా చూపడమే కాకుండా నెలకు దానికి రూ.10 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లుగా కూడా లెక్కల్లో చూపించారు. సో... జగన్ తన సొంతింటికే అద్దె కడుతున్నట్లన్నమాట.