Begin typing your search above and press return to search.
జగన్ దగ్గరి మనిషి దారుణం
By: Tupaki Desk | 8 Oct 2015 1:26 PM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తూ దూకుడు మీదున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. దీక్ష ద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని, తన చరిష్మాను పెంచుకోవాలని చూసిన జగన్ ఆలోచనకు ఇపుడు ఆయన సొంత మనుషులే గండికొట్టారు. జగన్ వద్ద వ్యక్తిగత కెమెరామెన్ గా పనిచేస్తున్న వంశీ కట్టుకున్న భార్యను చంపి పాతిపెట్టినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం బర్రంకులలో భార్య వరలక్ష్మిని హత్యచేసిన వంశీ ఆమెను పాతిపెట్టినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితమే ఈ ఈ దారుణానికి ఒడిగట్టిన వంశీ ఏమీ తెలియనట్లు ఉన్నారు. అదే క్రమంలో తన భార్య కనిపించడం లేదని నాగాయలంక పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే కూతురు కనిపించకపోవడం, వంశీపై అనుమానం రావడంతో వరలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారు వంశీని విచారించగా ఆయన నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో... వరలక్ష్మి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై తగు విచారణను నిష్పక్షపాతంగా జరపాలని హెచ్చార్సీ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది.
వైఎస్ జగన్ పేరుచెప్పుకొని తనపై ఏ కేసు నమోదు కాకుండా వంశీ ప్రయత్నాలు చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ వంశీపై కేసు నమోదుకాకపోవడం ఇందుకు బలం చేకూరుస్తుంది. అయితే జగన్ ప్రతిష్టాత్మక దీక్ష సమయంలోనే ఈ ఘటన జరగడం ఆయనకు పెద్ద దెబ్బ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.