Begin typing your search above and press return to search.

కామ్రేడ్ కు జగన్ ఫోన్ చేశారు

By:  Tupaki Desk   |   2 Oct 2016 10:17 AM GMT
కామ్రేడ్ కు జగన్ ఫోన్ చేశారు
X
ఏపీలోని భీమవరం మండలంలో షురూ అయిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణ పనులపై విపక్షాలు.. ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులకు.. రాజకీయ నేతలకు మధ్య రచ్చ నడుస్తోంది. నిరసనలు.. ధర్నాలు భారీగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 144సెక్షన్ ను విధించారు. మరోవైపు.. ఆక్వా ఫుడ్ పార్క్ పనుల్ని వ్యతిరేకిస్తున్న పలు గ్రామాల్లోని వారి అభిప్రాయాన్ని తెలుసుకోవటం కోసం సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు భీమవరం వెళ్లారు.

అయితే.. ఆయన్ను అక్కడి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు సీపీఎం కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భీమవరం.. చుట్టుపక్కల మండలాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మధును పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆయనపైనా.. ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలపైనా పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీపీఎం ముఖ్యనేత మధుకు ఫోన్ చేశారు. ఆక్వా ఫుడ్ పార్క్ అంశంపై మాట్లాడటంతో పాటు.. భీమవరం పోలీసులు వ్యవహరించిన తీరును.. అక్కడ ఎదురైన పరిస్థితుల గురించి ఆరా తీశారు. మధుపైనా.. ఆయన పార్టీ నేతలు.. కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ తప్పు పట్టారు.